ప్రద్యుమ్ను డీతడు వ్యక్తమై సృష్టిని
రచియించు నప్పుడు రమణ మీర
అనిరుధ్ధు డీత డయ్యద్భుత సృష్టిని
కాచి రక్షించు ప్రకరణ మందు
సంకర్షణు డితడు సకల సృష్టి హరించు
పట్టున ప్రళయ తాపములయందు
వాసుదేవు డితడు వర పరమాత్మయై
సర్వము తానయి పర్వునపుడు
విష్ణు దేవు డితడు వినగ నీశ్వరు డంచు
వేద వేద్యు లరసి వేడు నపుడు
చిన్ని కృష్ణు డితడు చేరి యశోదను
ముప్పు తిప్పలిడుచు మొరగు నపుడు .
మాష్టారు గారు, కృష్ణ శతకం వ్రాసే పనిలో ఉన్నారా? ఇప్పటిదాకా మీరు వ్రాసిన అన్ని కృష్ణుడి పద్యాలు చాల బావున్నాయి. వాటన్నింటిలో ఆయన చేయి కనిపిస్తోంది.
రిప్లయితొలగించండిసార్ ,
రిప్లయితొలగించండిఅన్యగామి గారూ ,
నమస్తే .
భగవధ్యానం లో నా కలవాటయిన రీతిలో
కృష్ణుణ్ణి భజిస్తూ కాలం గడుపుకుంటున్నాను .
నాకిది మంచి కాలక్షేపం అనిపిస్తోంది .
ధన్యవాదాలు .
నిటలాక్షుండు హరించి లోకముల దండింపంగ , కల్లోల సం
రిప్లయితొలగించండిఘటనన్ , బాల మనోఙ్ఞ రూపమున శంఖంబాది దివ్యాయుధో
ద్భట సంధాన కరాంబుజ ప్రకర శోభాయత్త సందీప్తివై
వటపత్రంబున బవ్వలించితివ దేవా ! ఆదినారాయణా !