పొగడనా కృష్ణయ్య ! పొలుపైన పద్యాల
తేనెలా తియ్యని తెనుగులోన
కీర్తించనా హరీ ! ఆర్తితో గూడిన
సుమధుర హృదయ సంస్తుతులతోన
పాడనా కన్నయ్య ! పవళింపు సేవలో
పాల్గొని నిద్దుర పట్టు దాక
పాదము లొత్తనా పలు లోగిళుల్ చన్న
యలసటల్ తీరంగ నంబుజాక్ష !
ఏమి సేయ మందువుర , నాకేమి పాలు
బోదు , పరమాత్మ ! నినుజేరు మోక్ష పథము
నే యుపాయము చేత బన్నింప నగునొ !
దారి జూపుము మాధవా ! చేరి కొలుతు .
ఈ కామెంట్‌ను రచయిత తీసివేశారు.
రిప్లయితొలగించండిఏమి సేయ మందువుర , నాకేమి పాలు
రిప్లయితొలగించండిబోదు , పరమాత్మ ! నినుజేరు మోక్ష పథము
నే యుపాయము చేత బన్నింప నగునొ !
దారి జూపుము మాధవా ! చేరి కొలుతు .
Bio Rockers