సుజన సృజన

సుజన సృజన
ఓం నమో సాయి నాధాయ

22, జులై 2020, బుధవారం

కబరీభర కందము .....


పడతుక కబరీభరమున
నడుమ పసిడి సూర్యబింబనాగరమును , పై
గుడుసున మల్లెల సరములు
ముడిచె , మదనరథపు చక్రమో యన సరసుల్

10 కామెంట్‌లు:



  1. పరువము పొంగిపొరిలెను మ
    ధురమై పుష్పంబమరగ తురిమిన కొప్పున్
    విరిబోణి జిలేబీ కవి
    వరులెల్లరి మదియు తూగు పద్యములలరన్



    నారదా బారో:)



    జిలేబి

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. నారాయణ! నారాయణ! నారాయణ! హేముకుంద! నారదవరదా! పారాయణమేదీ? సుర 'బారా'యణపర్వ చెక్క భజనలు దక్కన్ .

      తొలగించండి
  2. మదనరధపు చక్రం
    ఏమి కవి చమత్కారం :)

    రిప్లయితొలగించండి


  3. మదనరథపు చక్రంబును
    సదనమ్మున త్రిప్పినారు జవరాలి పొదిన్
    పదముల మాకందముతో
    పదిలం బొనరించి కంద పద్యపు నెఱితో


    జిలేబి

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. సారు మరీసరసులె! , బే
      జారయెనేమి తల? సౌరుచదురు గనంగా ,
      ఊరక కన్నార్పక గుట
      కారక చూస్తుందురేమి? గడుసు మడుసులే !

      తొలగించండి
  4. // “ ........, తిరిగిచూడవె ముత్యాల సరుల దాన
    చేరి మాటాడు చెంగావి చీర దాన” // అంటాడు శ్రీనాథుడు.

    కవి సార్వభౌముని వలె మీరు కూడా సరసులే 🙂.

    పాపం, ఎంతసేపు కష్టపడి అలంకరించుకుందో ? కానీ బాగుంది 👌.

    రిప్లయితొలగించండి
  5. కానీ,బాగుం దనుటన్,
    పూని మరో అర్థ ముంది , ముదితా? సొగసా?
    మానిని కళాపిపాసను
    మానితముగ వొగడినాను మరు మాటొల్లన్ .

    రిప్లయితొలగించండి
  6. “ముదిత” తన మొహం అటువైపుకు తిప్పుకుని నిలబడిందిగా. కాబట్టి బాగుందన్నది “సొగసు”నే.

    రిప్లయితొలగించండి