సుజన సృజన

సుజన సృజన
ఓం నమో సాయి నాధాయ

24, జులై 2020, శుక్రవారం

ఇదేందయ్యా ! కిట్టయ్యా !


ఏందిర ? ఓసోసి ! మొగము
పందిరిపై జుట్టుచెదిరె, పరవశమా?ఆ
ముందరి పలుసందులపై
చిందు నగవు ముత్యములను చేకొందు హరీ !



20 కామెంట్‌లు:



  1. తిలకము బెట్టితి వీవు ప
    దిలముగ మదిదోచినావు తియతీపిగ న
    వ్వుల పూయించితి వీవు క
    నుల పిరియము చూపినావు నుతులివె కృష్ణా



    జిలేబి

    రిప్లయితొలగించండి
  2. మతినీవే, గతినీవే,
    జతనీవే, జగదధీశ! శరణమునీవే,
    శతపత్రకమలవికసిత
    సితముఖవిలసితహసితపు చెలువుల కృష్ణా !

    రిప్లయితొలగించండి


  3. జతగాడివై సఖునిగ జ
    గతి భక్తిపథమున శరణు గైకొనగా, ని
    న్ను తలచి‌న తక్షణమున వి
    నతి చేయగ దౌడురుకుల నన్జేరుదువే



    జిలేబి

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. దౌడురికి రార, కన్నా!
      వేడెద నేనును జిలేబి విబుధులు శర్మా ,
      తోడు నరసన్న , బండియు ,
      గోడుంబిళ్ళాడుకొనగ గోపాల ! హరీ !


      తొలగించండి
    2. దౌడు=పరుగు, ఉరుకు=పరుగు, దౌడురుకు=పరుగుపరుగు. కొత్తమాట,మంచి ప్రయోగం

      తొలగించండి
    3. పరమాత్మతో గూటీబిళ్ళా ఆట ఎంత కోరిక సార్, జన్మ తరించింది,ఊహకే. ఆనాడు చల్దులారగించిన గోపాలురమా?

      తొలగించండి
    4. ఆనాటి గోప గోపీ
      ఙ్ఞానమిదే , స్వఛ్ఛమైన సరసహృదయసం
      ధానమె , నమ్మిన వారితొ
      మానితముగ నాడవచ్చు మాధవుడు వెసన్ .

      తొలగించండి
  4. పాడెద నీ నామమె , నే
    వేడెద కరుణార్ద్ర హృదయ! విను! పరమాత్మా !
    ఏడుగడయు నీవేగద ,
    సూడిద ' శిరసా 🙏 నమామి ' జోజో కృష్ణా !

    రిప్లయితొలగించండి
  5. చిత్రం వేసిన కళాకారునిదే ఆనందం. మీరు వివరించినట్లు ఆ పలువరుస సందులోని చిరునవ్వు అపురూపం

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. పరమాత్మకళలు దెలిసిన
      వరకరములుగీయు చిత్రభావమెరిగినన్
      పరమానందమునొందును
      సరిహృదయులమానసంబు శర్మాజి! కనన్ ..

      తొలగించండి


  6. ములకుగిరి కనుల మదిని వి
    మలమణి వలె యొనరిచి చెలిమరి, దయ గొనుమా!
    పలువరుసల నడుమ వికసి
    త లసిత మృదుమధురపు లలిత కలిత కృష్ణా!


    జిలేబి

    రిప్లయితొలగించండి
  7. క్రోవియయి , మోవిపయి , వెదు
    రే విహరించంగ , నాత్మ - ప్రియపరమాత్మన్
    శ్రీవినుతునిజేర , తపము
    గావించుచు , తహతహ పడుగాదె ! తరించన్ .

    రిప్లయితొలగించండి
  8. బృందావన మధుబనిలో
    బృందారక గోప గోపి బృంద విహారీ !
    సుందర సురుచిర మోహన !
    నందసతీ హృదయకమల నందిత కృష్ణా !

    రిప్లయితొలగించండి
  9. చూడని వారెవరు మదన
    చూడామణి సొగసు , చూచి చూరలుగొనుచున్
    వేడని వారెవరు దొరా !
    నేడు ననున్ గలవరచెను , నీలాకృష్ణా !

    రిప్లయితొలగించండి


  10. చూచితి నిన్నని తెలుసును
    వైచిత్రియు నీదని పరవశులై తూగం
    గా చిన్ని వాడ నవ్వుల
    తో చీకాకులను తృటిని ద్రోలెదవు కదా!


    జిలేబి

    రిప్లయితొలగించండి


  11. మా యమ్మ యశోద కుమా
    రా! యవనారీ! ముకుంద! రాధారమణా!
    శ్రీ యదుకులనందన! నీ
    వేయన్నియు కంబుధరుడ! వెన్నుడ! కృష్ణా!


    జిలేబి

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. వెన్నతినగ రా రమ్మను ,
      కన్నా ! నీ ప్రేమవెన్న కన్నాముర , నీ
      మన్నన యున్నను చాలును ,
      పన్నుగ పదసేవ జేయ బట్టెద కృష్ణా !

      తొలగించండి
  12. ప్రతి మనిషీ రాధ , హరియె
    గతియని , సతతమ్ము నమ్మి , కరుణాలోలున్
    జత నిలువగ తపియించును ,
    వ్రతమిది పరమాత్మ జేర , భాగవతులకున్ .

    రిప్లయితొలగించండి


  13. తింటివటా మన్ను యశో
    దింటా! చూపించితివట తిన్నగ లోకాల్
    కొంటెతనమ్ముల గోపిక
    లెంట తిరిగినావటా! భళిభళీ కృష్ణా!



    జిలేబి

    రిప్లయితొలగించండి
  14. ఈ కామెంట్‌ను రచయిత తీసివేశారు.

    రిప్లయితొలగించండి