సుజన సృజన

సుజన సృజన
ఓం నమో సాయి నాధాయ

23, జులై 2020, గురువారం

వచ్చె వచ్చె కన్నయ్య .....


వచ్చె వచ్చె కన్నయ్య ఈ వంక వచ్చె
పరుగు పరుగున ఆలు దౌడురుక వెనుక
నవ్వు మోమున త్రుళ్ళింత నగలు మెఱయ
ఆడుకొందము రావయ్య ! ఆది పురుష ! .

ఆ నవ్వుమీది మోహము
మానంగా తరమ ? మాకు , మానసచోరా !
రా ,  నాతండ్రీ ! పరుగున ,
రానా ? నేనైన ,  నాడ , రాత్రిందివముల్ .

4 కామెంట్‌లు:

  1. /దౌడురుక/మంచి పద ప్రయోగం :)

    రిప్లయితొలగించండి


  2. కన్నడి మాట



    రావయ్యా రాజా సై
    రావడి తోడాటలాడ రాత్రియు, ఘృణియో,
    ఆవల, యీవల తీరా
    లేవియు లేని తలము దరి లేరెవ్వరయా!



    జిలేబి

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. ఆ నవ్వేమిటి? ముత్యా
      లోనాతండ్రీ! యెడనెడ నురలెడు దారిన్,
      నేనేరుకొందు కన్నా !
      పోనీ యొకకొన్నియిత్తు బుధులకు కృష్ణా !

      తొలగించండి