ప్రద్యుమ్ను డీతడు వ్యక్తమై సృష్టిని
రచియించు నప్పుడు రమణ మీర
అనిరుధ్ధు డీత డయ్యద్భుత సృష్టిని
కాచి రక్షించు ప్రకరణ మందు
సంకర్షణు డితడు సకల సృష్టి హరించు
పట్టున ప్రళయ తాపములయందు
వాసుదేవు డితడు వర పరమాత్మయై
సర్వము తానయి పర్వునపుడు
విష్ణు దేవు డితడు వినగ నీశ్వరు డంచు
వేద వేద్యు లరసి వేడు నపుడు
చిన్ని కృష్ణు డితడు చేరి యశోదను
ముప్పు తిప్పలిడుచు మొరయు నపుడు .
గీతాధ్యయనము చేసిన
రిప్లయితొలగించండిగీతాచార్యుడె హితుడగు , కేల్వట్టి మనన్
ప్రీతిగ నడిపించు సకల
రీతుల కాపాడి , యతనికృప యమృత సమానమ్ .
జయ మురళీ సమ్మోహన !
రిప్లయితొలగించండిజయజయ ముకుళిత మనోఙ్ఞ చక్షు సరోజా!
జయ సన్నుత శ్రుత కుండల!
జయజయ తిరుమణి విభాస! జయ శ్రీకృష్ణా !
పన్నుగ మదిలో నున్నను
రిప్లయితొలగించండికన్నులు నీకేసి చూచు , కాంక్ష విడదురా !
మన్నించు మాధవా ! నిను
నెన్నక నిదురేమిరాదు , నీరజ నయనా !