సుజన సృజన

సుజన సృజన
ఓం నమో సాయి నాధాయ

11, ఆగస్టు 2020, మంగళవారం

తులసీదళ మంగళ గళ !

 


తులసీదళ మంగళ గళ !

విలసిత హేమాంబరధర ! విష్ణువిలాసా !

అలరుల పరిమళ మలదిన

కలవపుషా ! కృష్ణ ! మమ్ము గావర తండ్రీ !

6 కామెంట్‌లు:

  1. కనులారా పరమాత్మను
    గనుచును మనసార తలచు ఘనులను కృష్ణుం
    డనునిత్యము గాచును తన
    కనుగొలకుల చూపు బరపి కరుణామయుడై .

    రిప్లయితొలగించండి
  2. మాస్టారూ,
    "జిలేబి" గారి "వరూధిని" బ్లాగులో ఈ రోజు
    // "మీకూ, పెద్దలు నరసింహరావుగారికీ కృష్ణ జన్మాష్టమి పర్వదిన శుభాకాంక్షలు ." //
    అని మీరు పెట్టిన గ్రీటింగ్సులో ఆ "నరసింహారావు" నేనే అనుకుంటున్నాను 🤔 🙂. ధన్యవాదాలు. ఈ పాటతో మీకున్నూ కృష్ణాష్టమి శుభాకాంక్షలు 👇.

    కస్తూరీ తిలకం

    రిప్లయితొలగించండి
  3. వేరొండు గలరె పెద్దలు
    మీరే పదహారణాల మిత్రులగుమిలో
    వీరికి భాస్కర శర్మకు
    వారికి తాడిగడప బుధవరులకు కూడా .


    రిప్లయితొలగించండి
    రిప్లయిలు


    1. జాల్రా మాది కూడా గైకొనుడీ :)


      ఇదిగో చైంచిక్ జాల్రా
      సదనపు రాజన్నకు నరసన్నకు ప్రణతుల్
      విదురులు కష్టేఫలికిన్
      వదాన్యులగు శ్యామలీయ వరులకు కౌడీల్


      జిలేబి

      తొలగించండి
    2. థాంక్స్, "జిలేబి" గారూ. మీకు కూడా కృష్ణాష్టమి శుభాకాంక్షలు.
      కృష్ణం వందే జగద్గురుం

      తొలగించండి
    3. *అందరికీ‌ శ్రీకృష్ణజన్మాష్టమీ పర్వదిన శుభాకాంక్షలు*

      తొలగించండి