సుజన సృజన

సుజన సృజన
ఓం నమో సాయి నాధాయ

11, ఆగస్టు 2020, మంగళవారం

అడుగో ! పరమాత్మ .....

 


అడుగులు తడబడ బుడుతం

డడుగో, పరమాత్మ యతడె , అడుగిడెడి, మహా

త్ముడు కృష్ణుండు, యశోదసు

తుడు , జగతి కేడుగడగ , దొరికెను దొరయై .

2 కామెంట్‌లు:

  1. మతినీవే, గతినీవే,
    జతనీవే, జగదధీశ! శరణమునీవే,
    శతపత్రకమలవికసిత
    సితముఖవిలసితహసితపు చెలువుల కృష్ణా !

    రిప్లయితొలగించండి
  2. అన్నింటా అతడేనని ,
    అన్నిటి కతడే కతమని , అనుభోక్తయునం
    చెన్ని , విజయువోలె , విధుల్
    బన్నించెడువాడు , విజయపథమున నడుచున్ .

    రిప్లయితొలగించండి