సుజన సృజన

సుజన సృజన
ఓం నమో సాయి నాధాయ

12, నవంబర్ 2020, గురువారం

పాదపూజ .....

 

ఓనమాల్ దిద్దించు నొజ్జకు మ్రొక్కుటే

పరమేశ్వరున కిడు పాద పూజ

ఆమ్మ , ఆవుల తోటి ‘ అఆ ‘ లు దిద్దుటే

పాలిచ్చు తల్లికి పాద పూజ

సుమతి , వేమన పద్య సూక్తులు పాడుటే

భాషా మతల్లికి పాద పూజ

తియ్య తియ్యగ నేర్చి తెలుగు మాటాడుటే

పంతులు గారికి పాద పూజ


మమ్మి డాడీలు కాదురా అమ్మ నాన్న ,

తెలుగు మాటాడ రాయంగ దివురు నాన్న!

తల్లిభాషను నేర్చి జోతలు ఘటిల్లి

పాడుటే నేలతల్లికి  పాదపూజ 🙏 .

6 కామెంట్‌లు:

  1. చిత్రం భళారే విచిత్రం, ఇంకా అమ్మా, నాన్నా అనే పిల్లలున్నారా? అలా పిలుస్తూంటే ఊరుకునే మమ్మీ,డాడే లున్నారా?


    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. సార్ ,
      చిత్రం విచిత్రమే .
      విషయమిది .....

      ఈ చిన్నారుల చేతిలో వెలుగు సాహిత్యమ్ము పేరేమిటో ?
      ఈ చిన్నారుల దేశమేదొ ? మరి యాచిన్నారు లెంచేత ఈ
      రోచుల్ గుల్కెడు గ్రంధరాజమును దాల్తుర్ మహానిష్టగా ?
      రేచున్ చిత్తమునన్ గుతూహలము ఆవృత్తాంతమున్ జెప్పెదన్ .

      అది భగవద్గీత , నిసుగు
      లదియు నెదర్లాండ్ , ప్రభుత్వ మచ్చట విధిగా
      జదివింతురు , పాఠ్యాంశం
      బిది , పాశ్చాత్యుల ప్రదేశ , మెంతో మనసై .

      తొలగించండి
  2. ఆ పిల్లవాడి చేతిలోనున్న పుస్తకం మీద “భగవద్గీత” అని వ్రాసున్నది రష్యన్ భాషలో.

    రిప్లయితొలగించండి