సుజన సృజన

సుజన సృజన
ఓం నమో సాయి నాధాయ

11, నవంబర్ 2020, బుధవారం

జడ యల్లాడెడు .....

 


జడ యల్లాడెడు,జాజిపూతురుముతో ,జాల్వారు కుచ్చుల్లతో,

నడు మల్లాడెడు,మాయురే!పిడికెడై ,నాజూకు యొడ్డాణపుం

గుడుసై,ముందుకువెన్కకై యొడలు,సోకుల్ మాడ , చెంచెక్కలా

డెడు ఊపుల్,చెఱుకుంగడల్ బలెను,చేడెల్ ,చూడ కన్విందగున్ .

15 కామెంట్‌లు:

  1. పద్యం కమ్మగా నడిచిది సారూ

    రిప్లయితొలగించండి
  2. జిలేబీసారు పద్యం కంటేనా ?
    ధన్యవాదాలూ సారూ . 🙏 లు కూడా .

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. సారూ!
      కందమ్మ పద్యాలు కుందనంకాదు. అవన్నీ ఫేక్టరీ పద్యాలండీ

      తొలగించండి


  3. కందము కాదండీ అవి
    ఛందస్సాఫ్ట్వేరు నుండి జారిన ఫేక్ట్రీ
    కందువ రాజన్నా, మా
    కందపు పద్యమ్ములన నిఖార్సుగ మీదే :)



    జాల్రా
    జిలేబి

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. అంత లేదులెండి , సుంతయు సభలోన
      పనికిరాక , తరుమబడిన వాణ్ణి ,
      తమరు బుధులలోన తలబండిపోయారు ,
      నిలిచి గెలిచినారు , నెనరు 🙏 లండి .

      తొలగించండి
  4. ఫోటోగ్రాఫర్ కళాపోషకుడు సుమండీ. అదను చూసి కెమేరాను క్లిక్ మనిపించాడు 👌. మొబైల్ ఫోన్, చాటింగులే లోకమనుకోకుండా ఈ కాలంలో కూడా ఒప్పులకుప్ప తిరిగే అమ్మాయిలున్నందుకు సంతోషం.

    రిప్లయితొలగించండి
  5. ఈ కామెంట్‌ను రచయిత తీసివేశారు.

    రిప్లయితొలగించండి
  6. అలా లంగా ఓణీ వేసుకున్న మమాయిల్ని చూసి ఎంత కాలమయిందో. ఈ మేకప్పు ఫోటో కోసమై యుండనోపని అనుమానం, అలాఫోటో తీసినతను కలాపోసకుడే :)

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. సారూ ,
      నిజమే కావచ్చు .
      ఐనా ,
      దృశ్యం ఆకట్టుకుంది .
      దీనికి జిలేబీసారు సాహిత్యం చేస్తే ,
      అద్దిరిపోద్ది .

      తొలగించండి


    2. మార్కెట్టు మహా టెన్షన్ లో పై ఆటలోనే వుంది‌ సీతమ్మతో :)
      ఎవరు ఎవర్ని మొదట వదిలేస్తారో‌ అన్నట్టు :) అది భంశు తెర పడ్డాక ఈ ఆకట్టుకునే ఆటకు వచ్చెదము :)

      వేచియుండుడీ :)


      జిలేబి

      తొలగించండి
  7. రాజావారు,
    దృశ్యం ఆకట్టుకున్న మాట నిజం, కందమ్మది జగణం కదండీ,ఇటువంటి సున్నిత భావాలు కదులుతాయా అని ఒక చిన్న అనుమానం,



    రిప్లయితొలగించండి
  8. కందంలో జగనానిది
    పొందుగ ఆరో గణంబు , పొసగదు బేసిన్ ,
    ఇందున జిలేబిసారుకు
    ఎందులకో జగణజంబు లేమా కతముల్ ?

    రిప్లయితొలగించండి


  9. ఇంతకీ ఈ క్రీడా విశేషము పేరేమిటండి ?

    ఖాతరు చేయకన్ తిరుగు కామితమైన విశాలనేత్రులై
    చేతిని చేయి వేసుకొని చెంగట చేరుచు రింగు రింగులన్
    భీతియు లేక సుంతయు ప్రవీణుల వోలె తిరమ్ము గా సఖుల్
    సేతవు లేని క్రీడల విశేషము చక్కగ చూచెదమ్మిదే!



    జిలేబి

    రిప్లయితొలగించండి
  10. పద్యంబాగుంది .అందుకే చిత్తరువుకు తమసాహిత్యం కోరుకున్నాను . ఐనా , పెద్దలేమందురో ?! ధన్యవాదాలు , పెద్దలు శ్రీనరసింహరావుగారు క్రీడానామము పేర్కొన్నారుగదా ! డౌటా ?

    రిప్లయితొలగించండి