సుజన సృజన

సుజన సృజన
ఓం నమో సాయి నాధాయ

13, నవంబర్ 2020, శుక్రవారం

దీపావళి శుభాకాంక్షలు




పార్వతీ పరమశి వానందలహరిలో
తడిసిన నానేల ధన్యతమము
సీతా రఘుపతీ విశిష్ట పాదాంబుజ
ముద్రితం నానేల మోక్ష పథము
రాధికాకృష్ణుల రాగహేళల ప్రేమ
లొలికిన నానేల యోగభూమి
సాయి శ్రధ్ధాసబూరీయ మార్గాలలో
నడచిన నానేల నందమయము

తీరుతీరుల నానేల దివ్యమయము
నాదు భరత భూమాతృపుణ్యాలు జేసి
ఆయు రారోగ్య సౌభాగ్య శ్రీయుతమయి
పుడమి దీపావళీపర్వ ముదిత యగుత !

2 కామెంట్‌లు:

  1. తేజరిల్లుగాత ! దీపావళీ పర్వ
    మందరి హృదయాల సందడించి ,
    బ్లాగులోకమందు పరిఢవిల్లెడి హితుల్
    నిండు సంతసాల నెగడుగాత !.

    రిప్లయితొలగించండి
  2. కొందరికి శుభాకాంక్షలు ,
    కొందరు ఘనులకు నమములు , కోవిదులకు ము
    న్ముందుగ శిరసా పడిపడి
    వందనములు , దివ్వెలసిరి పండుగ పూటన్ .

    రిప్లయితొలగించండి