పాలకుల మతాధిపతుల దుర్మార్గాలు
నిరసించి ప్రశ్నించి నిలిచినాడు
పీడిత తాడిత పేదల పక్షాన
ధీరుడై అండగా పోరినాడు
జనజీవనమున నిజానిజాలను దెల్పి
ప్రజలను చైతన్య పరచినాడు
అన్యాయ తీర్పు దౌష్ట్యానికి గుర్తుగా
సిలువపై ప్రాణాలు విడిచినాడు
భూమిపై దిగి వచ్చి ఈ పుణ్యమూర్తి
ప్రజల కోసము బ్రతికి ఈ ప్రజల కొఱకు
అమరు డైనాడు క్రీస్తు , మహాను భావ !
మరల రావయ్య , యొకమారు , మహికి తండ్రి !

కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి