16, ఏప్రిల్ 2012, సోమవారం

“ ఆర్థిక స్వావ లంబనే అసలు కిటుకు “


ఇల్లు తెగనమ్మి కూతురి పెళ్ళి జేసి

మురిసిపోదురు తలిదండ్రి , ముందు ముందు

భద్రతేలేని కూతురి భవిత గనరు ,

మధ్యతరగతి మన కుటుంబముల వారు



తనయ కార్థిక స్వావలంబన తదుపరి

మాత్రమే పెండ్లి ప్రస్థానమై యొనరిన

భద్రతలు గల్గు మహిళకు , భార్య మీద

మగని కధికార తీవ్రత మట్టు కొనును



ఆర్ధిక స్వావ లంబిత యైన యతివ

మగ డభద్రతా భావ మందు పడును

తాను వేషాలు వేసిన తగిన శాస్తి

జరుగు నను భయ మతనిలో పెరుగు చుండు



దిగువ , ఉన్నత తరగతి స్త్రీల లోని

స్వ స్వతంత్రతా భావ జాల మందు

గలుగు కిటుకిదే , యిచట మగనికి లేదు

మధ్యతరగతి మగనికిమల్లె యహము



తల్లి దండ్రికి కూతురి పెళ్ళి మీద

దృష్టి మారి , ఆమె భవిత తీరు మీద

దృష్ట పెట్టిన నాడు ఈ తీరు మారు

ఆర్థిక స్వావ లంబనే అసలు కిటుకు


7 కామెంట్‌లు:

  1. మీరు చెప్పినది చాలా కరక్ట్ మాష్టారు.“ ఆర్థిక స్వావ లంబనే అసలు కిటుకు “.
    నిజమేనండి

    రిప్లయితొలగించండి
  2. మధ్య తతగతి కుటుంబాలు ఆర్ధిక సామాజిక సమస్యలు, నైతిక విలువలు అనే చట్రంలో బిగించబడి ఉంటాయి. వాటిని అర్థం చేసుకుని పరిష్కరించుకుని ముందుకు వెళ్ళడమే జీవితం. అలాంటి మధ్య తరగతి జీవితాలకు చక్కటి సలహా మీ కవిత. వీలైనంత తొందరగా ఆడపిల్లకి పెళ్లి చేసి పంపాలనే దృక్పధం మారి, వాళ్ళను తమ కాళ్ళపై తమను నిలబడేలా చేయాల్సిన భాద్యత తల్లితండ్రుల పై ఉంది.

    రిప్లయితొలగించండి
  3. Meraj Fathima గారూ ,
    మధ్యతరగతి కుటుంబీకులు మారక తప్పదు . మీ భావ సారూప్యతకు ధన్యవాదములు .

    రిప్లయితొలగించండి
  4. పదవతరగతి పూర్తి చేసి వెళ్ళే అమ్మాయిలకు నేను ఇలాగే చెబుతుంటాను.మీరు మంచి పద్యాల రూపం లో వివరించారు.

    రిప్లయితొలగించండి