ఈ సుదీర్ఘ జీవన యాన కాల
గమనంలో 61 వసంతాలు పూర్తయినవి . ఈ రోజే అరవై రెండో పడి లోకి అడుగిడడం . అందుకే
వెనక్కు తిరిగి సింహావలోకనం చేసు కోవడం .
శైశవంలో , బాల్యంలో ,
యవ్వనంలో , నడి వయస్సులో ..... ఏర్పడిన సమస్యలూ – వాటిని అధిగమించడంలో జీవితం
నేర్పిన పాఠాలూ – అనుభవాల తో జీవితం పండి పోయింది .
కుటుంబ జీవనం , లోటు
పాట్లూ , భార్యా-బిడ్డలూ , వాళ్ళ బాధ్యతలూ – వ్యక్తిగత బాధ్యతగా తప్పని సరి .
ఇక పోతే , ఆర్థిక యిబ్బందులకు
తల యొగ్గి ఎంపిక చేసుకొన్నప్పటికీ , ఉపాధ్యాయ వృత్తి ద్వారా – లభించిన సామాజిక
సేవా మార్గం లో - నేను పొందిన ఆనందం అనిర్వచనీయం .
తొలి నుండీ చివరిదాకా –
నాకు తోడు నిలిచి , నన్ను నడిపించిన – నాలోని నిబధ్ధత , సామాజిక దృక్పథం – వృత్తిలో
సాధ్యమైనంతవరకు నన్ను సఫలీకృతుణ్ణి చేసినవి .
గ్రామీణ నేపథ్యంలో
సాగిన వృత్తి నిర్వహణ వల్ల – కేవలం పాఠశాల నిర్వహణ , బోధనలకే పరిమితం కాలేదు .
ఒక నిర్దిష్ఠ
కార్యక్రమాన్ని రూపొందించుకొని –
పాఠశాల ముగిసిన తర్వాత
మా ఉపాథ్యాయ సిబ్బందిని తోడు తీసుకొని , రోజుకొక ఆవాస ప్రాంతాన్ని సందర్శించడం ,
విద్యార్థుల – తల్లిదండ్రుల స్థితి గతులను విచారించడం చేసేవాడిని .
తద్వారా విద్యార్థి
పరిస్థితులు నాకే కాకుండా , మా ఉపాధ్యాయులకు కూడా అవగతమయ్యేవి . విద్యార్థి గైర్హాజరీకి
గానీ , అధ్యయనంలో వెనక బాటు తనానికి గానీ
అసలు కారణం తెలిసి పొయ్యేది .
విద్యార్థికి అవసరమైన
సహాయ సహకారాన్నందించి , సాధ్యమైనంత వరకు
అసలు సమస్యను పరిష్కరించ గలిగే వాళ్ళము .
గ్రామీణ విద్యా
వ్యవస్థలో మరొక దురన్యాయం ఉంది . తల్లి దండ్రుల ఆదాయ వనరులు తక్కువ .
కొడుకూ , కూతురూ –
ఇద్దరూ స్థానిక ప్రభుత్వ విద్యాలయాలలో – 10 లేదా ఇంటర్ వరకూ విద్య పూర్తి చేస్తారు
.
పై చదువులకు కేవలం మగ
పిల్ల వాడినే కొనసాగిస్తారు . అధ్యయనంలో ఎంత బాగా ముందున్నా – ఆడపిల్ల చదువు –
కొనసాగించరు . ఆర్థిక ఇబ్బందులే బలమైన కారణ మైనప్పటికీ , సామాజిక కారణాలు కూడా లేక
పోలేదు .
ఈ అంశం నన్ను ఎక్కువగా
బాధించేది . వాళ్ళ యిళ్ళకు వెళ్ళి సాధ్యమైనంతవరకు నచ్చచెప్పడం , పరిష్కారాన్ని
సూచించడం , మార్గదర్శనం చేయడం , సహాయ సహకారాలందించడం చేసేవాడిని .
ఈ విషయంలో
ప్రభుత్వాలు అందించే తోడ్పాటు చాలడం లేదు . అందులో చిత్తశుధ్ధి కొరవడుతోంది .
చదువులో ముందుండే
గ్రామీణ విద్యార్థుల విషయంలో – అందునా ఆడ పిల్లల విద్య విషయంలో – ఇప్పుడు కూడా –
సహాయ సహకారాలందిస్తూ , సరయిన మార్గ దర్శనం చేస్తూ – అందులో ఉండే ఆత్మ సంతృప్తిని
అనుభ విస్తూ ఉండడం – ఆనందంగా ఉంది .
జన్మదిన శుభాకాంక్షలు సార్..!!
రిప్లయితొలగించండిమీరు ఇలాగే చదువు కోసం తొడ్పడే మీకు ఆ భగవంతుడు ఆయురారోగ్యైశ్వర్యాలు ప్రసాదించాలని మనస్పూర్తి గా కోరుకుంతున్నాను....!
సీత గారూ ,
తొలగించండికృతఙ్ఞతా పూర్వక ధన్యవాదములు .
దీర్ఘాయుష్మాన్ భవ.ఆరోగ్యమస్తు, ఐశ్వర్యమస్తు.
రిప్లయితొలగించండిశర్మగారూ ,
తొలగించండితమ ఆత్మీయ సహృదయతలకు సదా కృతఙ్ఞతలు .
జన్మదిన శుభాకాంక్షలు సార్
రిప్లయితొలగించండిభారతి గారూ ,
తొలగించండిహృదయ పూర్వక ధన్యవాదములు .
జన్మదిన శుభాకాంక్షలు మాష్టారూ..ఉద్యోగాన్ని చట్రంలో బిగించక మానవతా ధర్మాన్ని జతకలిపి నిర్వర్తించారు. మీలాంటి ఉపాద్యాయులు ఈ దేశానికే గర్వకారణం. మిమ్మల్ని ఆ భావంతుడు చల్లగా చూడాలని మనస్పూర్తిగా కోరుకుంటున్నాను.
రిప్లయితొలగించండిజ్యోతిర్మయి గారూ ,
తొలగించండితమ ప్రశంశా పూర్వక ఆకాంక్ష లకు సర్వదా కృతఙ్ఞతలు .
హార్థిక జన్మదిన శుభాకాంక్షలు! మీరిలాంటి మరెన్నో పుట్టినరోజులు జరుపుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను.
రిప్లయితొలగించండిరసఙ్ఞ గారూ ,
తొలగించండితమ సహృదయతకు కృతఙ్ఞతా పూర్వక ధన్యవాదములు .
గురుతర బాధ్యత నిజముగ
రిప్లయితొలగించండిగురువై నెరవేర్చినంత కువలయములవే
సరియగు వృద్ధిని గాంచును
పరిపరి వందనమిడుదును భక్తిని కృష్ణా!
లక్ష్మీదేవి గారూ ,
తొలగించండితమ సహృదయతా వ్యాఖ్యకు కృతఙ్ఞతలు .
జగదా చార్యుడు కృష్ణడు
జగతికి బోధించి గీత జగతీ గురుడై
జగతికి చూపిన మార్గమె
జగతిని గల గురువులెల్ల చరియింప నగున్
మాష్టారు.. లేట్ గా చూసాను మీ టపా!
రిప్లయితొలగించండిజన్మదిన శుభాకాంక్షలు మీకు!
జలతారు వెన్నెల గారూ ,
తొలగించండితమ ఆదరాభిమానాలకు సర్వదా కృతఙ్ఞుడను .
మాస్టారూ... జన్మదిన శుభాకాంక్షలు. మీవంటి గురువుల సంఖ్య పెరగవలసిన అవసరం చాలా ఉంది.
రిప్లయితొలగించండిpuranapandaphani గారూ ,
తొలగించండితమ సౌహార్దతకు ధన్యవాదములు .
రాజా గారూ మీకు జన్మదిన శుభాకాంక్షలు , మన్నించాలి స్కూల్ పనుల్లో పడి లేట్ గా చూసాను.
రిప్లయితొలగించండితమ ఆదరాభిమానాలకు కృతఙ్ఞతలు మరయు ధన్యవాదములు ఫాతిమా జీ !
తొలగించండిమీరు ఉపాధ్యా వృత్తి లో జీవించారు మాస్టారు.ఎందరికో మీరు ఆదర్శం.
రిప్లయితొలగించండిధన్యవాదములు రవిశేఖర్ గారూ ,
రిప్లయితొలగించండి