సృష్టి
స్థితి లయ కారకుడై
విశ్య
మంతటను వ్యాపించి యున్న
జగన్నాధుడైన
ఆ
పరమేశ్వరుడు - విశ్వ ప్రేమికుడు .
పరమేశ్వర
సృష్టి యైన
విశ్వాంతరాళంలో
కొంత
భాగమైన మనభూమిపై
జీవించే
సమస్త జీవరాశి
కాధార
భూతుడైన
కర్మ
సాక్షి
శ్రీ
సూర్య నారాయణుడు - జీవ ప్రేమికుడు .
భూమిపై
విస్తరించిన
సమస్త
జల తరు గిర్యాది వనరుల ద్వారా
జీవాన్ని
పొదివి పట్టుకొని కాపాడు
ప్రకృతి
మాత - పృధివీ ప్రేమికురాలు .
ఆయాయి
కాలాలలో అవతరించి
పుడమి
జనుల నుద్బోధించి
మానవ
జాతికి మార్గ నిర్దేశం చేసి
సజీవంగా
మానవ జాతి హృన్మందిరాలలో
కొలువున్న
ప్రవక్తలు - మానవ ప్రేమికులు .
సృష్టి
ధర్మాచరిత
సహ
జీవన మాధుర్యం నుండి
బిడ్డలను
కని , పెంచి ,
అవ్యాజానురాగాన్ని
పంచే
తలి
దండ్రులు - సంతాన ప్రేమికులు .
మానవులను
పశుత్వం
నుండి వేరు చేసి
విజ్ఞానాన్నందించే
ఉపాథ్యాయ
గురువులు - శిష్య ప్రేమికులు .
మానవ
జాతి సుఖజీవనం కోరి
జీవిత
మంతా
ప్రయోగ
శాలల కంకితమై
క్రొత్త
క్రొత్త ఆవిష్కరణల నందించే
సైంటిస్టులు - మానవ మనుగడ ప్రేమికులు .
శారీరక
, మానసిక దయనీయ స్థితిలో
తమ
వద్దకు వచ్చిన
రోగులకు
స్వాస్థ్యాన్నందించే
వైద్య
నారాయణులు - మానవారోగ్య ప్రేమికులు .
అడుగడుగున
మానవ హితమే
మహోన్నతాశయంగా
జీవన
యానం సాగించే
సాహితీ
మూర్తులు ,
కళాకారులు
,
కార్మికులు
నిరంతర
- జన హిత ప్రేమికులు .
కానీ ,
-----
పరమేశ్వరుణ్ణి
కూడా
అసంబధ్ధ
కర్మ క్రతువుల లోకి లాగి
జనం
అమాయకత్వాన్ని ఆసరా చేసుకొని
అజ్ఞానాన్ని
బోధించే అంధ విశ్వాసులు –
పరమేశ్వర
నిబధ్ధమై
నిర్దుష్టమై
నిర్దిష్ట
గమనంలో సాగే
విశ్వాంతరాళ
జ్యోతిశ్చక్రానికి
వక్ర
భాష్యాన్ని కట్టి
పరతత్త్వంలోనే
చెడు
వెదికే కార్తాంతికులు -
నిరంతరం
జన జీవనంలో ఉన్నామని
జనాన్ని
భ్రమింప జేస్తూ ప్రజా సేవలో తరిస్తున్నామని భ్రమింపజేసుకుంటూ
స్వార్థం తప్ప
జనహిత మెరుగని
నీతిబాహ్యులైన
యావత్
రాజకీయ నేతలు -
పడుచు
ప్రాయపు
ప్రలోభాల
నధిగమించు
బలిమి
లేక
మోహావేశాలకు
బానిసలై
పెడత్రోవ
పట్టి
బాధ్యతలను
విస్మరించే
యువతీ
యువకులు -
వీళ్ళంతా
, -----
ఎప్పటికీ
ప్రేమికులు
కాలేరు .
కేవలం
కాముకులు
.
అద్భుతం ఆవిష్కరించారు.నిజాన్ని నిక్కచ్చిగా చెప్పారు.
రిప్లయితొలగించండిస్వార్ధాన్ని త్యజించి , లోకకళ్యాణానికి శ్రమించడమే ప్రేమకు పరమార్థం . స్వార్థానికి ఉపయేగించుకునేదేదీ ప్రేమ కాదు . కామం .
తొలగించండిభాస్కర శర్మ గారూ , ధన్యవాదములు .
మాస్టారు గారు!
రిప్లయితొలగించండిమీరు చెప్పింది "సత్యం".
చాలా చక్కగా చెప్పారు.
భారతి గారూ ,
రిప్లయితొలగించండిమెచ్చినందుకు ధన్యవాదములు .