చిరు హాస్యముల జల్లు సేద దీర్చెడు చోట
వికటాట్ట హాసాలు వీను లదిరె
సంస్కార విలసిత
చర్చ లుండెడు చోట
రచ్చలు రావిళ్ళు వచ్చి చేరె
పులకించి
రచనల ప్రోత్సహించెడు చోట
తిలకించు వారేరి ? తీరు మారె
కుల గజ్జి , ప్రాంతీయ కొట్లాటతో నిండి
తెలుగు సౌహార్దాలు నలిగి పోయె
వెరసి పిడికెడు గొంతుకల్ వెరపు దక్కి
తెలుగు బ్లాగుల పూదోట తెంచి పోసి
మించి
తాజెడ్డ కోతి ... సామెత చరించ
నిన్న మొన్నటి సౌరులు నేడు కనవు .
:)
రిప్లయితొలగించండిశర్మగారూ ,
తొలగించండిధన్యవాదములు .
చౌదరి గారూ ,
రిప్లయితొలగించండిధన్యవాదములు .