తెలుగు పద్యమెంత తీపు రా
! రుచి చూడు
చెఱకు రసము కంటె ,
చెలిమి కంటె ,
తేనెలో నిగిరిన తియ్యమామిడి కంటె
పల్లె సీమ లోని బ్రతుకు
కంటె .
పుట్టిల్లు తెలంగాణా ,
మెట్టిన పురి సింహ పురము , మిగిలిన చోట్లన్
పట్టము గట్టిరి తెలుగులు
దిట్టగదా ! తెలుగు పద్య ధీర కృతులలో .
తెలుగు పద్య సఖికి తిక్కన్న నేర్పించె
అచ్చమైన రాజ హంస నడలు
మాట తీరు , మంచి , మర్యాద నేర్పిరి
వేమన , గురజాడ
వివిధ గతుల .
తెలుగు సొంతమైన తేట గీతులు పాడె
ఆట వెలదు లందు నాట్య మాడె
కందమందు తెలుగు
విందులు సమకూర్చె
తెలుగు పద్య మౌర ! తెలుగు జాణ !
నెల్లూరు సన్నబియ్యము
జెల్ల పులస రాజమండ్రి చేపల పులుసున్
చల్లని మంజీర నీళ్లు
చెల్లును పద్యపు రుచికర చెలువము తోడన్ .
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి