చెడుపై కడదాకా యీ
పుడమిని పోరాడి దుర్గ పున్నెపు ప్రోవై
కడుకొని మంచికి విజయము
గడియించెను మార్గ దర్శిగా నిల్చి సదా .
చెడుపై పోరాడు డటం
చడుగడుగున విజయ దశమి సందేశ మిడున్
చెడుపై పోరాడుటయే
పుడమి జనులు దుర్గ గొలిచి పూజించు టగున్ .
ఏటేటా విజయ దశమి
పాటింతుము గాని దాని పరమార్థమ్మున్
దీటుగ పాటించ గలుగు
నాట గదా ! విజయ దశమి నవ్యత దాల్చున్ .
మన దాకా వచ్చు వరకు
మనకేమీ పట్టనట్లు మనుట విడిచి , చెం
తన గల చెడునెదిరించిన
ఘనవిజయము వచ్చు మంచి ఘనమై నిలుచున్
అమ్మ చెప్పినదిది , నమ్మి తనంతగా
నెవడు పూని సత్య నిష్ట గలిగి
చెడును పట్టుపట్టి చీల్చి చెండాడునో
వాని కండ నిలుచు వచ్చి దుర్గ .
పుడమిని పోరాడి దుర్గ పున్నెపు ప్రోవై
కడుకొని మంచికి విజయము
గడియించెను మార్గ దర్శిగా నిల్చి సదా .
చెడుపై పోరాడు డటం
చడుగడుగున విజయ దశమి సందేశ మిడున్
చెడుపై పోరాడుటయే
పుడమి జనులు దుర్గ గొలిచి పూజించు టగున్ .
ఏటేటా విజయ దశమి
పాటింతుము గాని దాని పరమార్థమ్మున్
దీటుగ పాటించ గలుగు
నాట గదా ! విజయ దశమి నవ్యత దాల్చున్ .
మన దాకా వచ్చు వరకు
మనకేమీ పట్టనట్లు మనుట విడిచి , చెం
తన గల చెడునెదిరించిన
ఘనవిజయము వచ్చు మంచి ఘనమై నిలుచున్
అమ్మ చెప్పినదిది , నమ్మి తనంతగా
నెవడు పూని సత్య నిష్ట గలిగి
చెడును పట్టుపట్టి చీల్చి చెండాడునో
వాని కండ నిలుచు వచ్చి దుర్గ .
దుష్టదూరా,దురాచార శమనీ, దోషవర్జితా
రిప్లయితొలగించండిసర్వజ్ఞా,సాంద్ర కరుణా, సమానాధికవర్జితా
దురిత దూర దుర్గ దుర్మార్గ నాశని
తొలగించండిదోష వర్జిత సతి దుష్ట దూర
సమధిక గుణ దోష సర్వఙ్ఞ సమభావ
సకల జగతి నేలు సాంద్ర కరుణ .
భేష్!
తొలగించండిఅభివాదములు .
తొలగించండి