తెలుగు నాట బలుకు తియ్యని మాటతో
తెలుగు పద్యము కొల్వు దీర వలయు
తెలుగు జాతీయాల తియ్యం దనాలతో
తెలుగు పద్యము కొల్వు దీర వలయు
తెల్గు గ్రామీణుల తీరు తెన్నుల తోడ
తెలుగు పద్యము కొల్వు దీర వలయు
తెల్గు లోగిళ్ల వర్ధిల్లు వెల్గుల తోడ
తెల్గు పద్యము కొల్వు దీర వలయు
కూడి పండితుల్ దలలూచు కొరకె గాక
తెల్గు లందరి కందంగ దివురు నటుల
తెల్గు ముంగిళ్ల గెడన సందీప్తు లిడగ
తెలుగు పద్యము తా గొల్వు దీర వలయు
తెలుగు తీపితనం తెలిపితిరి తియతీయగా...
రిప్లయితొలగించండితెనుగు తియ్యందనం అందించడంలో
తొలగించండిఅందెవేసిన చెయ్యి మీది .
ధన్యవాదములు .