బాష నుధ్ద రించ ప్రజలెల్ల రున్నారు ,
జనుల భాష కెందు చావు లేదు ,
వాగు బుధుల మాట వట్టిది , పుడమిపై
తెలుగు యశము సతము తేజరిల్లు .
తెలుగు మాటలాడి తీరక జరుగదు
యుగ యుగాల దాక , రగడ కెక్కి
తెలుగు వోవు ననుచు తిక్క తిక్కగ వాగు
బుధులకు పిసరైన బుధ్ధి గలద ?
ఫేసు బుక్కు మొదలు సోసలు మీడియా
లన్నిట మన తెలుగు రాణ కెక్కి
మునుపు కంటె నేడు ముచ్చటల్ మురియంగ
తెలుగు పలు విధాల తేజరిల్లు .
ఏదేశమేగినా ఈ
మాధుర్యము వీడినార ? మరువక తెలుగున్
సోదరులెంతోముదముగ
ప్రోదిగ నెన్నేని వ్రాయ బోవుట లేదా ?
రాజకీయ బుధ్ధి రచ్చకీడ్చును గాక
పోడిమ చెడుగాక బుధుల బుధ్ధి
జనము నోళ్లయందు ఘనముగా వృధ్ధియై
నాదు తెలుగు బ్రతుకు నరనరాన .
రాజకీయ బుధ్ధి రచ్చకీడ్చును గాక
రిప్లయితొలగించండిపోడిమ చెడుగాక బుధుల బుధ్ధి
జనము నోళ్లయందు ఘనముగా వృధ్ధియై
నాదు తెలుగు బ్రతుకు నరనరాన .
మంచిగా చెపితిరి
ప్రజల నాల్కల పయి బ్రతుకును భాషలు ,
రిప్లయితొలగించండిపండితుల మెదళ్ళ పైన కాదు,
ప్రజల నాల్కల పయి పరవశించు పలుకు
జీవ గుళిక , గొప్ప చేవ కలది .
సార్ , నమస్సులు , ధన్యవాదాలు