తనువు సమ్మోహన ధనువురా కృష్ణ! నా వలపు పద్యాల సేవలను గొనుము మురళీరవపు గానముల్ మత్తురా కృష్ణ ! వలపు పద్యాల సేవలను గొనుము కొనగంటి చూపులు మణిహారములు కృష్ణ ! వలపు పద్యాల సేవలను గొనుము పాద ముద్రలు దివ్యపథములురా కృష్ణ ! వలపు పద్యాల సేవలను గొనుము
సకల సన్మంగళాకార ! చతురులేడ నేర్చి నావురా కృష్ణయ్య ! నిన్ను వలచి రాధ మోహన యయ్యె , ఆ లాగె నేను , మాయ జేసితి వేమిరా ! మమ్ము కృష్ణ !
రిప్లయితొలగించండిఒక చేతిని మురళీ రవ
మొకకన్నున కరుణమీర ముద్దుల చూపుల్
త్రికరణ శుద్ధిగ నమ్మి వ్ర
జకిశోరా చేరి నాము సన్నుతి చేయన్
జిలేబి
పద్యం బాగుండండీ!
రిప్లయితొలగించండిగిద్యమనెడి పోటుగాళ్శ కిచకిచతరహా
విద్యలు చెల్లవికపయిన ,
సద్యస్ఫూర్తికి ప్రతిభకు సరిరారెవరున్ .
రారా తిరునామ నిటల !
రిప్లయితొలగించండిరారా కమలాల కనుల రమణీయ దొరా !
రారా ముత్యాల సరులు
జారగ తలపాగ మెఱయు జగజెట్టి హరీ!
కనులారా పరమాత్మను
రిప్లయితొలగించండిగనుచును మనసార తలచు ఘనులను కృష్ణుం
డనునిత్యము గాచును తన
కనుగొలకుల చూపు బరపి కరుణామయుడై .
రిప్లయితొలగించండివీడటే పూతన విషము చన్నుల పాలు
పాళితో ద్రావిన బాలకుండు
వీడటే బలుబండి విర్రవీగుచు గాల
దురుసున దన్నిన దుండ గీడు
వీడటే సుడిగాలి విధమెల్ల దాదెల్సి
పట్టుక మెడ వైచి పార వైచె
వీడటే మొన వ్రేల వేగమై గొండెత్తి
జేజేల దొర ఠీవి చిదిమి వైచె
వీడు యమున కాళింగుని వెడల నడచె
వీడు దొంగిలె నింటింట వెన్నలెల్ల
వీడు కార్చిచ్చు కబళించి వేగ మ్రింగె
వీని మహిమలు వివరింప వింతలమ్మ
కృష్ణ విలాసము
వెన్నముద్ద గణపతి పెద్దకవి
రిప్లయితొలగించండిఇతడటే నీటిలో నీదుచు బెళుకుచు
చదువుల దెచ్చిన సాహసుండు
ఇతడటే తరిగొండ యెత్తి వీపుననాని
పువ్వంబు పుట్టించు పుణ్యమూర్తి
ఇతడటే కొమ్మున నిలయెత్తి రక్కసు
దునిమి కింకలు వెట్టు దుండగీడ
ఇతడటే చెల్వపు టింపుతో గంభాన
వెడలికీలించిన వేషధారి
గబ్బిరాజులు చెలరేగ నుబ్బులణచె
నంపకోలను మున్నీట నాచినాడు
ఇతడు వ్రేతల కెల్లను నింటి మగడు
ఇతడు బుద్ధుడు కలికిని నెంచదగును
కృష్ణవిలాసము
వెన్నముద్ద గణపతి పెద్ద కవి
శిఖిపింఛ వలయిత శీర్ష కుంతలభార
రిప్లయితొలగించండివిపినప్రసూనాక్ష వీక్షితుండు
గిరిధాతు చిత్రిత తిరుతిలక మనోఙ్ఞ
వర రుచిర నిటల వర్ణితుండు
అమృత మ్మొలుక వేణు వనయమ్ము మ్రోయించు
లావణ్య రూప విలాసితుండు
బాల తమాల వినీల మంగళ తనూ
ప్రభల చెలంగు పరాత్పరుండు
నందబాలుండు , కృష్ణుండు , నగధరుండు
వాసుదేవుండు , గోగోప వర సఖుండు
గరిమ గీతోపదేశ జగద్గురుండు
మదిని సాక్షాత్కరించె నమస్కరింతు .
కలమందున , గళమందున ,
రిప్లయితొలగించండికలలందున , కనుల యందు , కాంక్షల యందున్
పలు పలుకు లేల ? కృష్ణుడు
తలపున గల 'గమ్య 'మందు తానై యుండున్
తనువు సమ్మోహన ధనువురా కృష్ణ! నా
రిప్లయితొలగించండివలపు పద్యాల సేవలను గొనుము
మురళీరవపు గానముల్ మత్తురా కృష్ణ !
వలపు పద్యాల సేవలను గొనుము
కొనగంటి చూపులు మణిహారములు కృష్ణ !
వలపు పద్యాల సేవలను గొనుము
పాద ముద్రలు దివ్యపథములురా కృష్ణ !
వలపు పద్యాల సేవలను గొనుము
సకల సన్మంగళాకార ! చతురులేడ
నేర్చి నావురా కృష్ణయ్య ! నిన్ను వలచి
రాధ మోహన యయ్యె , ఆ లాగె నేను ,
మాయ జేసితి వేమిరా ! మమ్ము కృష్ణ !