సుజన సృజన

సుజన సృజన
ఓం నమో సాయి నాధాయ

2, ఆగస్టు 2020, ఆదివారం

మొక్క నాటు మొక్కటి హితుడా !



సేయగా నెన్నియోగలవు , ఆశించు నర్థు
లెందరోగలరు , మనీషు లెందరో వి
శేషఘనకార్యములు కడు సేయు చుండి
రి, బుధ! మొక్కనాటు , మిది తేలిక, పనిగద !

మొక్కనాటుమొకటి, నేల మోదమందు,
నీవు చచ్చినా, బ్రతికియుంటావు వంద
లేళ్ళు దానిలో , మందికి పళ్ళు నీడ
లిడెద , వింతకంటెను ఘనతేది? హితుడ !

గట్టి మేలొక్కటీ చేయగా గదలరు
గొప్పలను చాటుకుందురు గోడలెక్కి
ఒట్టిమాటల ఘనకార్య ముట్టి కెక్క ,
దదిగొ! మృత్యువు తరుముచుగదియుచుండె .

2 కామెంట్‌లు:

  1. బ్లాగు హితులందరకూ ,
    '🌹ఫ్రెండ్ షిప్ డే🌹'
    శుభాకాంక్షలు🌲

    తియ్యనిది చెలిమి, తలుపులు
    ముయ్యనిగుడి, యహరహమ్ము ముందుకు నడిపే
    చెయ్యి, అవసరపడునపుడు
    వెయ్యివిధాలుగనిలబడు విష్ణుసమమురా !

    రిప్లయితొలగించండి
  2. వీచే గాలికి పూవులు
    నో చెప్పవు, చెలిమి సేయు ,నూచును తలలన్,
    పూచేపూవులను తడిమి,
    ఆ చెలిమిసుగంధ శోభ కలరును గాలుల్ .

    రిప్లయితొలగించండి