సుజన సృజన

సుజన సృజన
ఓం నమో సాయి నాధాయ

27, జులై 2020, సోమవారం

లయకారకా ! హరా !


జలనిధులు గగనతలములు
వెలుగులు వాయువులు పుడమి వివిధాయువులన్
కలగాపులగము జేసి స
కలసృష్టి హరించి విలయకాలయముడవై ,

అంతా ఐపోవగ , యే
కాంత నిశీధీ దిశాంత కాంతి మయూఖా
ధ్వాంత సుఖాసీనుడవయి
శాంత శుభాకారతపము శాయగ హితమా ?

2 కామెంట్‌లు:



  1. హితమగు తపముల చేయక
    పితలాటలతో సమయము వెచ్చించుట మా
    న్యతయగునా జనులకు ? కిను
    కొ తగు విధపు చర్య తీసు కొనగ ప్రళయమై?


    శంకర ఉవాచ
    జిలేబి

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. కినుకేల? దేవదేవుం
      డనుకూలము జీవజాలమంతటికిని, లో
      చననిటలాగ్నులు దెరలగ
      మనసగునా మగని కిటుల? మంగళగౌరీ !

      తొలగించండి