సుజన సృజన

సుజన సృజన
ఓం నమో సాయి నాధాయ

29, జులై 2020, బుధవారం

కొమ్మ కొమ్మకూ బొమ్ముంది ....


కొమ్మ కొమ్మకూ బొమ్ముంది , నిమ్మళముగ
చూడ నందరూ ఘన మనీషులె గణింప
ఎందరున్నారొ గమనింపు డెవ్వరెవరొ
అందరిని దెల్పు వారికి అందలములు .


చిత్రకారునికి కృతఙ్ఞతలు

4 కామెంట్‌లు:



  1. గాంధి ఖానబ్దులు గఫారు; కలరు లోక
    మాన్యులున్ను చాచానెహ్రు ;మవ్వమొందె
    భగతు సింగు; రాజీవుడు;భరత నారి
    ఇందిరమ్మ! రాజా కలరిందు లోన!



    సరియేనాండి ?


    జిలేబి

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. ఉన్నారింకా కొందరు
      మన్ననగల ఘనులు కొమ్మమాటుల సారూ!
      కన్నులు రిక్కించి కనుడు
      పన్నుగ నింకొందరు కనబడుదురు విబుధా !

      తొలగించండి


  2. లాల్బహాదూరు శాస్త్రి భళా సు‌భాసు
    బోసు బాబు సర్వేపల్లి బోధకుండు
    మొత్తము పది ముఖమ్ము లామోదమేన
    లేక లక్కాకులయ మిగిలెన తెలుపుడి


    జిలేబి

    రిప్లయితొలగించండి
  3. గాంధి ఖాను నెహ్రు ఘన లోకమాన్యుండు
    సర్వెపల్లి బోసు శాస్త్రిగార
    లిందు గలరు పదుగు రిందిర రాజీవు
    లందు భగతుసింగు నరయ గలము .

    మీరు పదిమందినీ గమనించారు ,
    అభినందనలు ,ధన్యవాదాలు .


    రిప్లయితొలగించండి