సుజన సృజన

సుజన సృజన
ఓం నమో సాయి నాధాయ

29, నవంబర్ 2020, ఆదివారం

ఈ తాటిచె ట్టెట్టి పుణ్యాలన్ జేసెనొ .....

 


ఈలావణ్య తనూవిభావరులనెందే గంటిమా? రంగు- రూ

పీ లాగెట్లు మిళిందమై యొనరె ! తన్వీ ! రా యిటన్, మోహనా

లేలా?నీ వరచాటు చేసెద , వహో! ఈ తాటి చెట్టెట్టి పు

ణ్యాలన్ జేసెనొ నీదు పొందు గనె , కన్యాలింగనా జేతయై .

11 కామెంట్‌లు:

  1. ఎక్కడివాడో? యక్షతనయేందు జయంతు వసంతు కంతునిన్
    జక్కదనంబునన్ గెలువజాలెడువాడు మహీసురాన్వయం
    బెక్కడ తనూ విభవమెక్కడ ఏలిన బంటుగా మరున్
    ఢక్కగొనంగరాదె అకటా నను వీడు పరిగ్రహించినన్

    ఏటి ఇసయం ? :)

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. సారూ ,
      రంగూ మోహనమే , ఆ
      హంగూ మోహనమె రూప మందున, అరెహో !
      సంగతిదే , ప్రవరాఖ్యులు
      ఖంగు తినుట మువ్విథముల ఖాయంబనఘా !

      తొలగించండి
    2. మరి తాడెందుకు అడ్డం :)

      తొలగించండి
    3. మరి ,
      తాడి దన్నువాణ్ణి తలదన్ను రూపంబు
      నాదటంచు మోహనాంగి దెలుపు
      సన్న గాగ తాడి నెన్నుకో బట్టెనో !
      సన్నుతాంగి సౌరు చాల ఘనము .

      తొలగించండి
    4. ఐతే మీదే ఆలస్యం అనమాట. :)
      శుభం! దీవించేయండి

      తొలగించండి
  2. శోభనాలు మెచ్చి సోకు వర్ణించుటే
    భావకులకు దెలియు పనిగదయ్య !
    అంత మించు పనులు పంతుళ్ళు సేయరు
    పిదప ఘనులకార్యమది గదయ్య !

    రిప్లయితొలగించండి


  3. ఎట్టెట్టి పుణ్యముల మరి
    గట్టిగ చేసెనకొ? పుట్టుకాయెన్ కైపె
    క్కిట్టించు కైపు గా నదె
    కొట్టొచ్చిన కారణము ప్రకోపమునకయా :)


    జిలేబి

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. తవరేమి సెలవిచ్చేరో
      ఈ మట్టిబుర్ర కందలా మిత్రమా !

      తొలగించండి


    2. తవరేమి చెప్పిరో మా
      కు వలవిసుర ముక్కొకటియు కూసింతయు బు
      ర్రవరకు చన లేదాయే
      కవయిత్రీ మట్టిబుర్ర కందె జిలేబీ :)


      జిలేబి

      తొలగించండి
    3. తమరే కళ నున్నారో
      సమజైతాలేదు నాకు చదురులు చాలున్
      తమరికి బీమారేదీ
      చెమరించదుగా బుధుడ విశేష విధమునన్ .

      తొలగించండి