ఆవకాయ - అమరావతి
-----------------------------
భక్ష్య లేహ్య చోష్య బహువిథ భోజ్యాల
రుచులు చూచి చూచి రోత పుట్టి
నాల్క తుప్పు డుల్చు నవవిథ రుచి గూర్చి
తపము జేసె నొక్క ధార్మికుండు .
మంగళ గిరి ప్రాంతమునకు
చెంగట దిగి యతడు తపము జేయుచు నుండన్
రంగారు విపిన తలములు
క్రుంగంగా బారె నతని ఘోర తపమునన్ .
తపము బలము నింద్రు తాకెను , తనకేదొ
మూడె ననుచు నతడు ముగ్ధలైన
అప్సరోవనితల నంపె తపము గూల్చ
తలిరు బోడు లటకు తరలి రంత .
ఆమని యరుదెంచె నామ్ర తరువులన్ని
పూప పిందె బట్టి పొలుపు దాల్చె
రంభ కాయ గోసి రాగాల కారమ్ము
ఉప్పు పసుపు గూర్చి యూర బెట్టె .
మేనక ప్రియపడి మృదువుగా నందులో
నావ పిండి గలిపి చేవ గూర్చె
పప్పునూనె బోసె పరువాల యూర్వశి
రుచికి పడి ఘృతాచి లొట్ట సేసె .
అల్లంత దూరమందున
నుల్లము రంజిల్ల ' ఘాటు ' నోరూరించన్
కళ్లు దెరిచి వెళ్లి తబిసి
యల్లన రుచి చూచి తన్మయత్వము నందెన్ .
కొత్తావకాయ రుచి గని
తత్తర పడి తబిసి తపము ధన్యత గాంచన్
బిత్తరు లందరను గూడి
చిత్తము రంజిల్ల విడిది చేసెను తోటన్ .
పోయిన భామలు రాలే
దేమయినదొ యంచు నింద్ర దేవుడు వెదుకన్
ధీ మహితులు సురలందరు
భూమికి దిగి వచ్చి చూడ ' బొమ్మ ' కనబడెన్ .
తబిసి తలిరు బోళ్లు తనివార కొత్తావ
కాయ రుచులు గొనుచు కన బడి రట
దేవ గణము గూడి దేవాధిపతి గూడ
వచ్చి చేరి రుచికి మెచ్చి నారు .
ఆవ కాయ రుచికి యమరులు పరవశం
బంది స్వర్గ సీమ మరచి నారు
అచటె యుండి పోయి ' రమరావతి ' యనంగ
' నాంధ్ర రాజధాని ' యయ్యె నేడు .
అందమైన భామలతో ఆవకాయ! కాన్సెప్ట్ బాగుందనుకుంటానండీ! తెనుగు సినిమాచుట్టెయ్యచ్చేమో :)
రిప్లయితొలగించండి' అందమైన భామలతో ఆవకాయ '
తొలగించండిటైటిల్ బాగుందండీ !
మరి ,
ఱావు గారూ వగైరా మిత్ర బృందం
ఏమంటారో చూద్దాం .
' అందమైన భామలతో ఆవకాయ '
తొలగించండిటైటిల్ బాగుందండీ !
మరి ,
ఱావు గారూ వగైరా మిత్ర బృందం
ఏమంటారో చూద్దాం .
రిప్లయితొలగించండిమా ఆవకాయ తినిర
మ్మా యబ్బురపడుచు రంభ మాహేంద్రాదుల్
ఓయమ్మ తిష్ట వేయగ
మా యమరావతి పడుసర మయ్యె జిలేబీ :)
జిలేబి
ధన్యవాదములు
తొలగించండిఆవకాయ పద్యమాల - చదవ కనుల "విందు" - వుంది నోరూరించేలా
రిప్లయితొలగించండిధన్యవాదములు
తొలగించండిధన్యవాదములు
తొలగించండి