అశ్రు నివాళి
--------------
మమతాను రాగాలు మనిషియై జన్మించి
ధన్యత గాంచిన తన్వి తాను
బంధు జనుల పట్ల బహు ప్రీతి జూపించి
తల లోన నాల్కయౌ తన్వి తాను
పేద సాదల కింత పెట్టు ధర్మ నిరతి
తనరారు చేతల తన్వి తాను
భర్తయు , బిడ్డల పటు ప్రేమ లను బొంది
తనిసి జీవించిన తన్వి తాను
ఇన్ని యిచ్చియు నారోగ్య మీని యీశ్వ
రుని చెయిదమును ప్రశ్నించ పనిగొని తను
నా సుభాషిణి దివికేగె -- నశ్రు జలము
లారవు నయనాల -- నివాళు లందు కొనుము .
రిప్లయితొలగించండిశ్రీ లక్కాకుల రాజా రావు గారికి,
మీకు ఆ దేవదేవుని అనుగ్రహము చల్లగ యుండు గాక
జిలేబి
ధన్యవాదాలండి .
తొలగించండిరాజారావుగారు,
రిప్లయితొలగించండిరెండురోజులముందే టపా చూశానుగాని..... జాతస్య మరణం ధృవం, చెబుతాం కాని కావలసినవారు కాలం చేసినపుడు బాధ తప్పదు....భగవంతుడే చల్లగా చూడాలి..
కృతఙ్ఞతలండీ .
తొలగించండిదగ్గరివారు ఎవరు పోయినా బాధే కానీ జీవితభాగస్వామిని కోల్పోవడం అంతులేని బాధ. మీకు, మీ కుటుంబానికీ ప్రగాఢ సానుభూతి.
రిప్లయితొలగించండిThank you sir ,
తొలగించండిమీ వియోగానికి నేను చింతిస్తున్నాను. మీకు శాంతిని, ధైర్యాన్ని కూర్చమని ఆ దేవదేవునిప్రార్థిస్తూ...
రిప్లయితొలగించండిThank you sir ,
తొలగించండిDear Sir,
రిప్లయితొలగించండిI am not adept in consoling a grieving person.But I sincerely wish you to overcome From the desperation of your life partner.I promise you I can make you smile now and then even though I cannot bring your wife back!
Regards
hari.S.babu
Thank you sir ,
తొలగించండి😔 My condolences to your family, Sir!
రిప్లయితొలగించండిThank you Mam ,
తొలగించండిఅయ్యో మీరు భాగస్వామిని కోల్పోయిన విషయం ఆలస్యంగా తెలిసింది...మన్నించండి.
రిప్లయితొలగించండిఆవిడకు శ్రద్ధాంజలి ఘటిస్తూ..
మీకు మనోధైర్యాన్ని చేకూర్చాలని కోరుకుంటున్నాను!
Thank you madam
తొలగించండి