తెలగలు , వొంటరుల్ , బలిజ ధీరులు , కాపులు తెల్గు నేలపై
గలరు విశేష సంఖ్యల , సకాలములో తమ శక్తి జూపి , ఈ
మలినపు రాజకీయమును మట్టున బెట్ట మహోగ్ర మూర్తులై
తెలుగు ధరాతలమ్ము నినదింపగ సంఘటితమ్ము కావలెన్ .
ఇతరుల కాళ్ళవద్ద యసలేల పడుండగ ? , రోష శౌర్య సం
వృతమతులై , స్వయం జ్వలిత వేగ సుసంఘటి తాంతరాత్మతా
స్తుతిమతులై , వినూత్న గతి , వంచకులన్ దిగద్రొబ్బి , భ్రాతలై
సతతము రాష్ట్ర పాలనకు సందడి సేయుడు రాజ్యకాంక్షతో .
దుదయము నొందు దాక , పునరున్నతి బొందెడు దాక , కృష్ణరా
య ధరణి నాధు ప్రాభవ మహా మహనీయత లొప్పు దాక , సం
విధ సముదైక్య సంఘటిత వేదిక గావలె కాపు వర్గముల్ .
అదే సరైన మార్గం అనిపిస్తోంద☝️.
రిప్లయితొలగించండినేల విడిచి నింగి నేలగా కోరికల్
చాల గలవు , గాని , తేలి పోయి
చుక్కల గమి నడుమ చుక్కగా భాసిల్ల
కలలు గనుట గాక , వలను పడున ?
అవును .....
తొలగించండికాకలు దీరిన కాపులు
తోకలు పట్టంగనేల ? తొల్లింటి మహా
భీకర పోరాట పటిమ
శ్రీకరముగ గలదు పోరు చేయండొకటై .
స్థిరముగ ఇరవై శాతము
వరముగ వోటర్లు కాపు వర్గము నందున్
వెరసి గలరు పోరు సలుప
కరములు కలపండి కాపు కధికారముకై .
ఐనా ,
నాపద్యం నాకే అప్పజెప్పారే .
ధన్యవాదములండీ .
సొంతంగా పద్యాలు వ్రాయడం రాదు కదండీ...చదివినవి ఇలా వాడేసుకుంటానన్నమాట !
రిప్లయితొలగించండిపవన్ కళ్యాణ్ మీద మీకు ఆశలున్నాయా ?
ఇప్పటికే మీకు అర్థమయ్యుంటుంది .
తొలగించండి