సుజన సృజన

సుజన సృజన
ఓం నమో సాయి నాధాయ

25, మే 2020, సోమవారం

ఇవిగో మల్లెలు .....


ఇవిగో ! మల్లెలు , మండుటెండలకునూ ఈపూలకున్నేదియో
రవియున్ గాంచని గోప్యబంధజితమౌ రాగంబు గన్పట్టెడిన్ ,
జవరాండ్రన్ తలలెక్కి  చొక్కి ధవులన్ సాధించగా కుట్రయో ?
యవనిన్ గంధపరీమళంపు జిగితో నాహ్లాదమున్ జేయుటో ?

6 కామెంట్‌లు:

  1. చిత్రంలోని నాజూకైన అమ్మాయి ఏడు మల్లెపూలెత్తు రాకుమారి లాగానే ఉంది.

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. 'ఏడు మల్లె లెత్తు ఇంతి ఈపూబంతి'
      సరస హృదయు లండి నరస సారు
      మండు టెండ లందు మల్లెల సౌరభం
      తాకి మగువ మీద మనసు పడిరి .

      తొలగించండి


  2. ఏడు మల్లెపూలెత్తుల నెలతుకయె జి
    లేబి వలెవుండె రోయన్న! లెస్స లెస్స
    చూడ చూడ ముచ్చటగా ప్రచోదితమయె
    నయ్యరోమది ననలెత్తెనయ్య వేడి :)

    నారదా!

    జిలేబి

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. అళి నీలాలకల విడి , త్రి
      వళులు కనీ కనని , పాడు పరువముల్
      తళ తళ మన , పడతి గనగ
      కళవళపడి సారు కాస్త కంగారయ్యెన్ .

      తొలగించండి
  3. // “.... సారు కాస్త కంగారయ్యెన్” //

    కంగారు పడే వయసా నాది? “పడతి” నాజూకుగా, చూడ ముచ్చటగా ఉంది అన్నాను అంతే. కళాపోషణన్నమాట.

    రిప్లయితొలగించండి
  4. కళవళ పడలేదు , సరస
    కళే ,కళాపోషణే , ప్రగాఢ రసాస్వా
    దాళి విభవమే నన్నా !
    తాళిమి లేదంటినేమి ? తమరికి , తెలియున్ .


    రిప్లయితొలగించండి