29, మే 2020, శుక్రవారం
అమృతఫలాలు .....
అమృత ఫలాలు
--------------------
అమృతఫలాలివి , వీటిని
సుమశరు డింద్రుని వనమున చూచి , పుడమికిన్
రమణి రతీదేవి కొఱకు ,
శ్రమపడి కొనితెచ్చె రాగ రంజితు డగుచున్ .
రుచికి పడి , రతీ దేవి వ
లచి తన వనమున యమృతఫలమ్మును విత్తెన్ ,
సచిపతి కిష్ట ఫలదమగు
యచలము మదనాలి యింట నమరెను తరువై
వలరేని చెలిమికాడగు
వలపు వసంతుం డచటికి వచ్చెను , రాగా ,
కలయో మాయో తెలియదు ,
విలసిల్లెను చెట్టు పూప పిందె ఫలాలన్ .
మావి పండు తిన్న మన్మథ పతిసతుల్
మదన మోహ ఝరుల మరులు గొనిరి ,
మధుర ఫలము మహిమ మదనాయితమ్మను
నిజము తెలిసె , దివిజ రుజయు దెలిసె .
భూలోక మంత మావుల
జాలము నాటించి చిత్తజాతుడు , మిథునా
లోల సరాగాలాలస
లీలల పండించె , సృష్టి లీల లివేగా .
దీనికి సబ్స్క్రయిబ్ చేయి:
కామెంట్లను పోస్ట్ చేయి (Atom)
రాజావారు
రిప్లయితొలగించండిపై చెఱుకు రసాల పళ్ళలా పద్యాలూ ఎంతబావున్నాయో
తొలగించండిఆమ్ రస్ బన్గయా షుగర్కేన్ జ్యూస్ :)
శర్మగారూ , నమస్సులు , ధన్యవాదములు .
తొలగించండిదివిజు లమృత ఫలమ్మని తినిరి , ఋషులు
మధుర ఫలమని జుఱ్ఱిరి , మనుజు లకట
మరి మరి భుజియింత్రుగద ! యీ మదన ఫలము
సారు కిష్టమేగద ! యీ రసాల ఫలము .
జిలేబీ సారు ! నమస్సులు ,ధన్యవాదములు .
తొలగించండితమరేమంటిరొ తెలియను ,
కమనీయం బెపుడు తమరి కామెంట్ , అవునూ ,
అమృత ఫల రసమున షుగరు
అమరున చెడగొట్టు గాని , అమృతము రుచిన్ .
వేసవి అంటే మామిడిపళ్ళే కదండీ, అందులోనూ చూడగానే చెప్పేరకాలు,బహు పసందైనవి,కొత్తపల్లి కొబ్బరి,చెఱుకు రసాలు (ఫోటోలోవి పెద్ద రసాలు)బంగినపల్లి,పంచదార కలశ, దేశవాళీ. ఫోటో పెట్టి ఊరించేసేరు :)
రిప్లయితొలగించండిచాలా బాగుంది మీ పద్యం మామిడి పళ్లంటే చాలా ఇష్టం నాకు.
రిప్లయితొలగించండిబహుకాలమయ్యె, మీరిటు
తొలగించండివిహితా! చనుదెంచి, నాటి విమలమతులు చా
ల హితుల్, బ్లాగ్ నిష్క్రమణన్,
అహితంబై కళలుదప్పె నంతయు నిచటన్ .