సుజన సృజన

సుజన సృజన
ఓం నమో సాయి నాధాయ

5, జూన్ 2020, శుక్రవారం

జన్మదినం .....


(జూన్ 5 నాజన్మదినం)
పుట్టిన రోజిది యని .....
------------------------
ఎందుకు జనించితినొ స్వామి ! యెవ్వియును ఘ
నతలు లేవు , కనీసము వెతలు లేని
బతుకు బతికితినా యన్న  - వెతుక - నట్టి
బాట సుతరాము కనరాదు  భాగ్య ధాత !

పుట్టినరో జిదియని యి
ప్పట్టున క్యాలండరు నను పదె పదె గాసిం
బెట్టుచు హసించె , స్వామీ !
పుట్టువునకు సార్థకత్వ పూర్ణత లేమిన్ .

ఒజ్జదన మొక కొంత మేలుజ్జగించి
కాస్త యూరట దొరికెను కమల నయన !
మండు టెండన బడి వచ్చు మనిషి కొకట
చల్ల దొరికిన వడువున జలజనాభ !

ఎంద రీ భూమి బుట్టి సాధించిరి , పురు
షార్థములు , సంశయమె , యైన , నంద రిటువ
లె వగతుర ? సందియమె స్వామి ! , చివరిమజిలి
యైన భయద రహితము శాయంగ రాద !

అంబు జోజ్జ్వల దివ్య పాదారవింద !
నీదు చింతనామృత చిత్త నీమ మొకటె
కడవ బెట్టంగ నావయై గానుపించు
జరను రుజలను దాటంగ , పరమ పురుష !

6 కామెంట్‌లు:

  1. జన్మదిన శుభాకాంక్షలు, రాజారావు మాస్టారు.
    పుట్టిన రేజు నాడేల నిర్వేదం, మాస్టారూ? మంచి పనులు చేస్తూ శేషజీవితాన్ని గడుపుతున్న మీకీ నైరాశ్యం తగదు.
    మరోసారి పుట్టినరోజు శుభాకాంక్షలు.

    రిప్లయితొలగించండి
  2. పెద్దలు శ్రీనరసింహరావుగారూ ,🙏.
    ధన్యవాదములు .

    రిప్లయితొలగించండి


  3. నావయని నన్ను తలచి స్వ
    భావపు రీతి నరులిలను పరుగుల మార్గం
    బోవ గలదేమి కవివరు
    డా విభుడను నేను చేయడానికి జగతిన్ !


    శుభాకాంక్షలతో
    జిలేబి
    గుండు సున్న :)

    రిప్లయితొలగించండి
  4. మా జిలేబిసారు బుధులు ,మాన్యులు ,వ
    దాన్యులును ,గుండుసున్న విధాన మేల ?
    మీదు మిక్కిలి హితులుజుమీ ! వయస్య !
    తమ 'శుభాకాంక్ష' లందుకొంటిమి ముదమున.

    రిప్లయితొలగించండి
  5. జన్మదిన శుభాకాంక్షలు గురువు గారు. మీరు ఆయురారోగ్యాలతో సుఖసంతోషాలతో జీవించాలని మనసారా కోరుకుంటున్నాను _/\_ ...

    రిప్లయితొలగించండి
  6. మిత్రులు బండి నాగమల్లీశ్వర రావుగారికి
    ధన్యవాదములు .

    రిప్లయితొలగించండి