సుజన సృజన

సుజన సృజన
ఓం నమో సాయి నాధాయ

15, నవంబర్ 2020, ఆదివారం

ఫలముల్ మెక్కెడివారు .....



 


ఫలము ల్మెక్కెడివారు తత్ఫల రసాస్వాదక్రియాలోలురై

పలుమా ఱమ్మధురత్వము న్నుతుల సంభావింతురేగాని, త

త్ఫల హేతుక్రమవృక్షముం దలపరెవ్వారైన, నట్లే రమా

కలితు ల్భోగములన్‌ భుజించుచు నినుం గన్నెత్తియుంజూతురే?

     ----- కవికోకిల దువ్వూరు . రామిరెడ్డి

               కృషీవలుడు నుండి


5 కామెంట్‌లు:



  1. Just because you guys don't recognise will I stop giving fruits ?

    కన్నెత్తి జూడకున్నను
    పన్నెత్తియు మాటలాడు వారలెవరు లే
    కున్నను మధుర ఫలమ్ముల
    నెన్నైన విడువక నిత్తు నిదె కందువగా!


    జిలేబి

    రిప్లయితొలగించండి
  2. చెట్టు తన ధర్మం తను నెరవేరుస్తోందని “జిలేబి” గారు చక్కటి భావంతో కూడిన పద్యం చెప్పారు 👌.

    రిప్లయితొలగించండి
  3. మనిషే తన ధర్మంబును
    మనమున మరిచేడటన్న మహితార్థంబున్
    వినిపించె జిలేబీజీ
    ధ్వనిరూప సుభాషితమున తనరు విధమునన్ .

    రిప్లయితొలగించండి


  4. తన ధర్మము విడువక చె
    ట్టు నమ్రతను చూపెనని చటుక్కున తెలిపా
    రు నెనరులు మీకిదె జిలే
    బి నచ్చె చెప్పిన విధమ్ము విధిని తెలిపెగా!


    జిలేబి

    రిప్లయితొలగించండి
  5. పులపుల్లగ తియతియ్యగ
    ఫలముల్ మెక్కుచు తరువుల ప్రకృధ్ధర్మం
    బు లయించి జిలేబి నుడివె ,
    తలపరు వివరాలు నుడువ తమధర్మంబున్ .

    రిప్లయితొలగించండి