పద్య - వచన కవితలు మరియు వివిథ అంశాలకు సంబంధించిన వ్యాసాలు
మట్టి ప్రమిద దెచ్చి మహదేవు నర్చించి
ఆవు నెయ్యి వోసి అభవు నెదుట
వత్తి వేసి శివుని వాకిట ప్రతి రోజు
దీప మిడుడు , జన్మ తేజరిల్లు .
మట్టి ప్రమిద లోన మరి కాను పించడు
నూనె లోన గనగ నోప మతని
ప్రత్తి లోను దాని వత్తిలో గనరాని
శివుడు దివ్వె లోన చేరియుండు
ఈరోజు ఙ్ఞానపంచమివారక గురుసేవ చేసి వర్ధిల్లు దినంబారయ గురుదేవుండాసారఙ్ఞానప్రదుండు సాయీశ్వరుడే .
ఈరోజు ఙ్ఞానపంచమి
రిప్లయితొలగించండివారక గురుసేవ చేసి వర్ధిల్లు దినం
బారయ గురుదేవుండా
సారఙ్ఞానప్రదుండు సాయీశ్వరుడే .