సుజన సృజన

సుజన సృజన
ఓం నమో సాయి నాధాయ

12, అక్టోబర్ 2022, బుధవారం

అతిమనోహరము

 

అర చిరునవ్వు మోమపయి అబ్బురమై మెరయంగ నింతిరో !

కరములు సాచి , విల్దొడిగి , కంజపు టమ్మును కంతుడేసి న ,

ట్లరయగ చూడ్కులన్ బరపుటల్ గననయ్యెడి , నింక నెవ్వడో

ఉరము పెటిల్లునన్ బగిలి , ఊపిరి గోల్పడుటల్ ధ్వనించెడిన్ .

6 కామెంట్‌లు:

  1. ముగ్థ మోహనం.
    నవ్వకే నవమల్లికా (జనహితార్థం 🙂🙂).

    రిప్లయితొలగించండి
  2. మీరు చేసిన వర్ణన మరింత మహత్తరంగా ఉంది, శర్మ గారు 👌.
    అవును, కాటుకకంటి వాలుచూపు విరితూపే అవుతుంది గదా.

    రిప్లయితొలగించండి
  3. కవికంటె భావుకులె గొ
    ప్ప , విన్నకోట విబుధా ! కవనమందలి శో
    భ వివిధగతి వివరింతురు ,
    చవులెరిన శర్మగారు ! శహభాష్ , నమముల్ .

    రిప్లయితొలగించండి
  4. అది అంబపలుకు
    జగదంబకు వందనం
    మిత్రులిద్దరికి అభినందనం.

    రిప్లయితొలగించండి
  5. అసమాన భావుకత్వపు
    రసికతలును దెలిసె , నింత రమణీయ మతుల్
    వసివాడవు , జరలు రుజలు
    ముసిరిననూ , నిత్యనూతనోత్సాహములన్ .

    రిప్లయితొలగించండి