పద్యాలు రాయండి ఇలా సులువుగా
---------------------------------------------
సుమతి వేమన్నలు చూపిన బాటలో
పద్యాలు రాయండి బాగు బాగు
పదజాలము కొఱకు పరగ నిఘంటువుల్
పరికింప పనిలేదు బహు విథముగ
మనము మాటాడు ఆ మాటలే శోభిలు
పద్య మందున అర్థవంత మగుచు
ఇది సాధు విదిగొ అసాధు వను రభస
మనకేల గ్రామీణ భాష మనది
చాల సులభము సఖుడ ! పద్యాలు రాయ
స్టైలు కాస్తంత పట్టుకో చాలు చాలు
నీవు పద్యాలు రాయంగ నేర్వగలవు
ఈ యుగాదిన మొదలెట్టు మేల జాగు .
ఈ యుగాది గూర్చి రాయండి ఇక్కడే
చిన్న మాటలందు చెలువు మెరయ
వెర పదేల రావ వేమన పద్యాలు
వాటి బాట పట్ట వచ్చు స్టైలు .
ఉప్పు కప్పురంబు ఒక్క పోలిక నుండు
చూడ చూడ రుచుల జాడ వేరు
సగము పద్య మయ్యె సఖుడ ఇట్టివి రెండు
సగము లైన పద్య సౌరు లొలుకు .
యతులు గణము లనుచు మతివోగ గానేల
భయము వలదు స్టైలు పట్టు మొదట
పిదప యతి గణాలు వెదుకు కొనుచు వచ్చి
పద్య మందు పడును వరుస గాను .
ఆట వెలది స్టైలు అందల మెక్కించు
రిప్లయితొలగించండిరాయ పద్యములను రాగ మొలుక
నాన నాన నాన నానాన నానాన
నాన నాన నాన నాన నాన
ననన ననన ననన నననన నననన
ననన ననన ననన ననన ననన
నాన ననన లైన నానన నననన
దేని నైన పట్టు తెలుగు హితుడ !
పలుకుటకు పట్టే టైమును బట్టి అక్షరాలను రెండుగా ...
రిప్లయితొలగించండిన , నా లుగా ... నం కూడా నా లోదే ...
తెలుగులో ఒత్తక్షరాలూ ఉంటాయి
అన్న అన్నప్పుడు అ పలకడానికి పట్టే టైమెక్కువ
అక్ష అన్నప్పుడు కూడా అంతే
పట్టే టైమును గుర్తిస్తే మీరు పద్యాలు రాయడానికి రెడీ .
తీపు పులుపు చేదు తెలియ షడ్రుచులతో
రిప్లయితొలగించండితెలు గుగాది భువిని తిరుగు గాత !
పూప పిందె బట్టి భూమి వసంతమై
కనుల పండు వగుత ! ఘనము గాను .
పిన్న వయసు నందు వీలవ లేదని
రిప్లయితొలగించండిబాధ పడగ నేల ? పద్య విషయ
ఛందము లిపు డిట్లు సానబెట్టగ , కాస్త
కష్టమేగ సఖుడ ! కాన , ఇదిగొ !
మార్గ మొకటి కలదు , మదికి కుదురగును
స్టైలు పట్టు డంటి సరి సులువుగ ,
సాధనమున పనులు సమకూరు ధరలోన
విశ్వదాభిరామ ! వినుర వేమ .
మిత్రులందరకూ .....
రిప్లయితొలగించండిఉగాది శుభాకాంక్షలు
---------------------------
పట్టినది పసిడి యగు , చే
పట్టిన ప్రతి కార్యమెల్ల ఫలవంతమగున్
గట్టిగ ' ఉగాది ' మొదలుగ
తుట్ట తుదవరకును మీకు తోషం బొదవున్ .
----- లక్కాకుల వెంకటరాజారావు .
భాగవతము చదివి పరగ పోతన స్టైలు
రిప్లయితొలగించండిపట్టి పద్యములను వ్రాయ జనిరి
పెద్దన మనుచరిత ప్రియమారగ జదివి
వ్రాయ జనిరి రుచిర పద్యములను .
అసలు కిటుకు దెలియు , ' మాసక్తి ' కలుగుటే
అందరాని దేది అసలు లేదు
పూర్వజన్మ లుత్తి పుక్కిటి యూహలు
కార్యదీక్ష గలుగ , కలలు పండు .
పండితోత్తముండు పరుగున వచ్చును
రిప్లయితొలగించండిపద్య విద్య ' నంట ' వల దటంచు ,
పద్య విద్య యొకడి బాబు సొత్తా యేమి ?
పెట్టె లోన దాచి పెట్ట , సఖుడ !
తల్లి దండ్రి ద్వార తమ కందివచ్చిన
రిప్లయితొలగించండికళలు బిడ్డలందు గలుగ వచ్చు
అరయ వాటి పట్ల ఆసక్తి లేనిచో
ఆను వంశికాలు అమలు కావు .
దైవ దత్తమనుచు తర్కించ , దైవమ్ము
నందు భేద భావ మరయ గలమ ?
వరదుడు పరమాత్మ వలపక్షము వహించ
నెవరితో వచించ , నేది దారి ?
అరయ దేనికైన నాసక్తి మొదటిది ,
గురువు మార్గదర్శి , తెఱవు బట్టి
పట్టు వదల కుండ పనివడి నట్లైన
రాని విద్య లేదు , రగడ వలదు .
ముప్ప దెనిమి దేండ్లు ముదమార నొజ్జనై
నేను గాంచి నట్టి నిజ మిదేను
అరయ పిల్లలందు ఆసక్తు లొనరించి
చదువు నేర్పినాడ , సక్సె సిదియె .
వీడు పనికి రాడు , వీడికి చదు వబ్బ
దంచు కొంద ' రయ్య ' లందు రకట !
ద్రోహబుధ్ధి గల్గు ద్రోణులు వీరని
చెప్పదు కఠినముగ , ' ఛీ ఛి ' యనుచు .
మాష్టారూ,
రిప్లయితొలగించండిద్రోణాచార్యులకు ద్రోహబుధ్ధి ఏమిటండీ? మీరూ సినిమాల భారతాన్నే ప్రమాణం అనుకుంటే ఎలాగండీ? తనను వధించటానికే యజ్ఞసముధ్బవుడైన ధృష్టద్యుమ్నుడిని శిష్యుడిగా స్వీకరించిన మహాత్ముడు ద్రోణాచార్యుడు.
ధన్యవాదములు
రిప్లయితొలగించండినాకు పూర్వమందు నావంశ మందుల
రిప్లయితొలగించండిలేరు కవులు , బుధులు లేశమైన
బతుకు దెఱవు కోరి ' పండిట్ ' కోర్సులో
చేరినాడ , చదివి , తీరినాడ .
కావ్య పఠన గరమ కల్పించె నాసక్తి
అభ్యసించ పద్య మలవడె సఖ !
పెద్దలు నను గాంచి పేర్మి జూపించిరి
' ఫేక్టరీవి ' యని శపించ లేదు .
పద్య విద్య నేర్వ బహు ప్రియంబగునేని
నేర్చుకొనుడు , ఇందు నేర మేమి ?
మనసు కిష్టమైన పనిని యాస్వాదించ
వచ్చు , పరుల గోల వలదు , మనకు .
చెలువ మొలుక , మనము చెప్పున దేమిటో
రిప్లయితొలగించండిచదువు వాడి మదిని కుదురు కొనద ,
తెలివిడి తన మంత , తెల్లారి నట్లౌను
కఠిన మైన భాష కడకు బోకు .
మనము మాటలాడు మామూలు మాటలే
పద్యమందు నిలుప వచ్చు , సఖుడ !
మొండి బండ పద్య పాండిత్య గరిమలు
పిచ్చి వాళ్ళ మదికి ప్రియ మొసంగు .
అరయ పద్యకళల నభ్యసించు సమయ
రిప్లయితొలగించండిమబ్బురముగ ' మెదడు ' హాయి గనును ,
దరికి రాదు చెత్త , తన్మయత్త్వంబున
మనసు నిలిచి , గెలుచు మహిత ఫలము .
కళలు మానవునికి ఘన తోషమును గూర్చు
మెదడు స్వస్థతపడు , యెద కలతలు
మలగు , బతుకు బరువు తొలగు గాన ,
కాస్త సమయ మివ్వు నేస్తమ ! , యిటు .
సతతము వొడిదుడుకులతో
సతమతమగు బతుకు కాస్త స్వస్థత కోరున్
వెతలను మరిపించును , సం
తత మానంద మొసగు ' కళ ',ధన్యత కలుగున్.
శ్రీసీతారామ సంస్తుతి
రిప్లయితొలగించండి--------------------------
ఆ కోదండముపట్టు ఠీవి , కనులందార్తావన జ్యోతులున్
రాకాశోభలుగుల్కు నెమ్మొగము , శ్రీరాజిల్లు వక్షంబునున్
లోకాలేలు కిరీటభాస్వికలు నీలోగంటి రామా ! త్రిలో
కైకారాధననామ ! నిన్గొలిచి మ్రొక్కంగల్గు సర్వార్థముల్ .
' రామా ' యని నోరారా ,
భూమిజ పతి దలచి , పిలువు , మో హితుడా ! ఆ
రామజపమె , కవచంబయి
సేమము లొనగూర్చి , మనకు శ్రీ లొసగు కడున్.
ఈ కామెంట్‌ను రచయిత తీసివేశారు.
తొలగించండిరామా ! యిదేమి గోల ? వి
తొలగించండిరామము లేదా ? మదిన్ చిరాకొదవెడు , నే
నేమయినన్ బాలుడనా ?
ఈ మాడ్కిన్ వెంట బడుచు నే (ర్పిం) డ్పింపంగాన్ .
అర్ధమైన దండీ.
రిప్లయితొలగించండిసర్వజ్ఞుల మని భావించుకొనే మీకు పొగడ్తలు తప్ప మరేమీ రుచించవని గ్రహించాను.
ఇక పొరపాటున కూడ తమరిని ఉద్దేశించి మాటలాడను. నిరుపయోగమైన పని చేయటం నాకూ అవసరం కాదు.
మీరూ మీ మిత్రులూ నిత్యం పరస్పరం కీర్తించుకుంటూ హాయిగా ఉండండి.
తదాస్తు
రిప్లయితొలగించండిరాముడె రారాజు భువికి ,
రిప్లయితొలగించండిభూమిజయే తల్లి , పవన పుత్రుడె దిక్కై
క్షేమము పొందుదురు జనులు ,
' నామ ' జపమె రక్ష సేయు , ననగా వినమే !
నభము వీడి సూర్య నారాయణుడు వచ్చె
రిప్లయితొలగించండిరామ దర్శనాభిరాము డగుచు
నగరి వీడి రామ నారాయణుడు వచ్చె
అంజ లించి యినున కర్ఘ్య మిడగ
ఇరువురు నారాయణు లా
సరయూ తీరాన ప్రధమ సంధ్యా విధులన్
దరిసిరి , దర్శన భాగ్యపు
సిరు లొందెను జగతి , మురిసి చేతులు మొగిడెన్ .
తల్లి సీతమ్మ నీదు ' సాతత్య ' మడిగె
రిప్లయితొలగించండి' బంటు రీతి ' కొలువడగె పవన సుతుడు
లక్ష్మణుడు నీదు ' పదసేవ ' లా వడిగెను
మాకు నీ ' యేలుబడి ' నిచ్చి , మనుపు రామ !
శ్రీరామ బంటు , అంజని
రిప్లయితొలగించండిగారాముల కూర్మి సుతుడు , ఘనుడున్ , జగతిన్
ఆరాధ్యుడు , మనకు సదా
హేరాళముగాగ రక్ష నిడుగాత ! సఖా !
పరమేశ్వర సంసేవిత !
రిప్లయితొలగించండివరదా ! శ్రీరామచంద్ర ! వర పరమాత్మా !
హరిహర రూప ! పరాత్పర !
మరి మరి ప్రార్థింతు 🙏 నిన్ను , మారుతి వినుతా !
శ్రీరామచంద్రమూర్తిని
రిప్లయితొలగించండినోరారా తలువు , మెంత నొవ్వు గలిగినన్
తీరుచు నా పరమాత్ముడు ,
పోరాడును నీ తరఫున పున్నెపు ప్రోవై .
విశ్వమంత రామ విమల నామ జపము
రిప్లయితొలగించండిచే పునీత మగుచు ప్రాపు గనెడు
రాముడు జనియించి భూమి భరత ఖండ
ఖ్యాతి జగతి యంత ఘనత వొందె .
సాకేత సార్వభౌమా !
రిప్లయితొలగించండిపాకారి వినుత రఘుకుల ప్రముఖా ! రామా !
శోకాలు బాపు శుభకర
ప్రాకట శ్రీహరి ! నమోస్తు 🙏 పావన నామా !
సీతారాముల పదములు
రిప్లయితొలగించండినా తలదాల్చి కొలుతున్ , ప్రణామము లిడుదున్
ఓ తండ్రీ ! నీవే నా
త్రాత వనుచు నమ్మినాను , దయగను రామా !
నిరతము పరమాత్మ జపము
రిప్లయితొలగించండిపరి పరి సేయంగ మనసు పడు మధుబనిలోన్ ,
హరి హృదయస్థితుడగు , నం
తరములు తొలగును , ప్రశాంత తత్త్వము కల్గున్ .
-
రిప్లయితొలగించండిపరమాత్మ జపము విడువక
నిరతము సేయగ హృదయము నిమ్మళమొందున్
హరి హరి యనవే మనసా
తరతమ భేదములు తొలగు తరియించెదవే
రయమున ' ఓం నారాయణ '
రిప్లయితొలగించండినయమారగ పల్కు ' మాదినారాయణ ' వెం
కయ సామి మంత్ర మిది , ఆ
దయా మయుడు వెంట నిలిచి తరియించు సదా !
వెంకయ్య స్వామి మా కిట
రిప్లయితొలగించండిసంకటములు బాపు సత్య సంధుడు , జను లీ
వంకకు వచ్చి తరింతురు
శంకల కిట తావు లేదు జరుగును కోర్కెల్ .
-
రిప్లయితొలగించండినీవు నన్ను విడిచినను నేను నిన్ను
విడువను బలికె నాసామి వేగము విడు
వంగను దురాశ విడుచును వ్యాకులమదె
నాకలి గొనిన జనులకు నాల్గు మెతుకు
లిమ్ము వెంకయ్య సామి బలికె జిలేబి
ఈ కామెంట్‌ను రచయిత తీసివేశారు.
రిప్లయితొలగించండిఏ మహితాత్ముని ధామమ్ము శాంతికి
రిప్లయితొలగించండిచిరునామగా విలసిల్లు చుండు ?
ఏ మందిరము మహనీయమై తర తమ
భేదాలు లేక శోభిల్లు చుండు ?
ఏ మూర్తిని స్పృశించి యిరవొంద నానంద
పారవశ్యము వీలు పడుచు నుండు ?
ఎచ్చోట దూరాలు , హెచ్చుబాటులు తగ్గి
అందరొక్కటి గాగ నలరు చుంద్రు ?
ఏ యనఘు దర్శనముచేత హాయి గలుగు ?
కోర్కెలీరేడు , కష్టాలు గూలి పడును
ఆతడే సాయి - జనులలో నమ్మక మిది
నమ్మకమె దైవమయి నిల్చు , వమ్ము గాదు .
శ్రధ్ధా , సబూరిలు చక్కగా పాటించ
రిప్లయితొలగించండిహితబోధ చేసిన హితు డితండు
రెండు రూపాయల దండి దక్షిణ గొని
కష్టాలు బాపిన ఇష్ట సఖుడు
రోగార్తులను తాకి రుజ బాధలను బాపి
తాననుభవించిన త్యాగ శీలి
' సాయి ! కాపాడ రారా ' యన్న తక్షణ
మాదుకొను కరుణామయు డితండు
సర్వ దేవతా సత్తాక సద్గురుండు
సాయి నాధుండు – తమ మనసార కోరి
చరణములు తాకి తరియింత్రు సకల జనులు
శరణు శరణంచు వేడి ప్రశాంతి బొంద .
బంగారు పేటంచు పట్టుపుట్టము గట్టి ,
రిప్లయితొలగించండిరత్నాల హార సరాలు దొడిగి ,
మణికిరీట ప్రభామయ , మయూఖ రుచిర ,
దివ్యమంగళ రూపు తేజరిల్ల ,
వజ్రాలు పొదిగిన వడ్డాణము మెరయ ,
కాలి యందెలు ఘల్లు ఘల్లురనగ ,
పసుపు గంధపు పూతపై , కుంకుమంబద్ది
ఫాలభాగమ్ము శోభనము గూర్చ ,
లేచి , ననుజూచి , వచ్చి , పోలేరు తల్లి
బిడ్డడా ! రార , యని బిల్చు ప్రేమతోడ ,
బ్రమయొ , పిచ్చియొ గానిండు , ప్రతిదినంబు
అమ్మవాకిట జేరి ప్రణామ మిడగ .