సుజన సృజన

సుజన సృజన
ఓం నమో సాయి నాధాయ

5, జనవరి 2021, మంగళవారం

ఓగుదగిడీలు

 


' దేశభాషలయందు తెలుగు లెస్స' ని వల్కె,

రాయలు కర్ణాట రాజరాజు,

' సుందర తెలుగ ' ని చొక్కి వచించె, సు

బ్రహ్మణ్యభారతిరా , తమిళుడు ,

అరయ ' ఇటాలియన్ ఆఫ్ ద ఈష్ట్ ' అంచు, ని

కోలకోంటి ఒక ఇటాలి మెచ్చె,

' అద్భుత ' భాషని అరచి చెప్పెను, బ్రౌను

ఇంగ్లీషుదొర గణియించి ఘనత,


దేశ దేశాల పండితుల్ తెలుగు మెచ్చి

వొగిడినా , రిదిగొ ! నిచటి 'వోగు దగిడి

గాళ్ళు' తామె బుధులవోలె, గ్రామ్యమనుచు

తెలుగు నుడులను నిరసింత్రు తులువ లగుచు .

2 కామెంట్‌లు:

  1. బాగోగులగూర్చి తమరు
    మీ 'గురుదేవుల' నడుగుడు మిత్రా!,పోనీ,
    సాగిలబడి 'విదుల' నడిగి
    ఆగము బడు డర్థమంత అవసరమైనన్ .

    రిప్లయితొలగించండి