7, డిసెంబర్ 2025, ఆదివారం

సొగసుల సోయగాల .....

 



సొగసుల సోయగాల దినుసుల్ జడి దాకి కకావికై , మనో

ఙ్ఞగతి సరాగమాడు నవమన్మథ ప్రేయసియో యనంగ తాన్

సుగతినిగాంచె నీయమప్రచోదితయై,యెదనిండమోహనాల్

రగిలి, మనోగతామృత సరాంతర మగ్న ప్రమోద సంస్థితిన్ .


డిసి ప్రకృతిలో రూపు తాదాత్మ్య మొంది
ముగ్ధ మోహన ఆనంద మూర్తి యయ్యె
ఇంత కన్న పరవశత్వ మేది కలదు ?
విభవములహో ! అనుభవైకవేద్యము కద !


1 కామెంట్‌:

  1. 'ఆనందో బ్రహ్మ' యనగ
    సానందిత నేత్రయుగళి సాయుజ్యమునన్
    మీనాక్షి మనసు దేహము
    ఆనందపు నాట్యహేల లందు తరించెన్ .

    రిప్లయితొలగించండి