29, జులై 2020, బుధవారం
కొమ్మ కొమ్మకూ బొమ్ముంది ....
కొమ్మ కొమ్మకూ బొమ్ముంది , నిమ్మళముగ
చూడ నందరూ ఘన మనీషులె గణింప
ఎందరున్నారొ గమనింపు డెవ్వరెవరొ
అందరిని దెల్పు వారికి అందలములు .
చిత్రకారునికి కృతఙ్ఞతలు
27, జులై 2020, సోమవారం
లయకారకా ! హరా !
జలనిధులు గగనతలములు
వెలుగులు వాయువులు పుడమి వివిధాయువులన్
కలగాపులగము జేసి స
కలసృష్టి హరించి విలయకాలయముడవై ,
అంతా ఐపోవగ , యే
కాంత నిశీధీ దిశాంత కాంతి మయూఖా
ధ్వాంత సుఖాసీనుడవయి
శాంత శుభాకారతపము శాయగ హితమా ?
తులసీ రాముడు .....
పరమభక్తుడుతులసిదాస్ పరవశించి
ఎదుట పాడంగసీతాసమేతుడగుచు
లక్ష్మణస్వామి మారుతు లాలకింప
రాముడే వచ్చి విన బట్టె రామచరిత
26, జులై 2020, ఆదివారం
వైద్యనారాయణులకు పాదాభివందనాలు
ఈ యిద్దరూ , కరోనా
గాయింబడి , ప్రక్క ప్రక్క గాసిలు , నందొ
క్కాయన డాక్టరు , కని , ప్ర
ప్రక్కాయన బా , ధపుడును , వైద్యము సేసెన్ 🙏.
(కార్టూనిష్ట్ కు ధన్యవాదములు ,కృతఙ్ఞతలతో)
24, జులై 2020, శుక్రవారం
పాశ్చాత్యంలో భగవద్గీత
ఈ చిన్నారుల చేతిలో వెలుగు సాహిత్యమ్ము పేరేమిటో ?
ఈ చిన్నారుల దేశమేదొ ? మరి యాచిన్నారు లెంచేత ఈ
రోచుల్ గుల్కెడు గ్రంధరాజమును దాల్తుర్ మహానిష్టగా ?
రేచున్ చిత్తమునన్ గుతూహలము ఆవృత్తాంతమున్ జెప్పెదన్ .
అది భగవద్గీత , నిసుగు
లదియు నెదర్లాండ్ , ప్రభుత్వ మచ్చట విధిగా
జదివింతురు , పాఠ్యాంశం
బిది , పాశ్చాత్యుల ప్రదేశ , మెంతో మనసై .

ఇదేందయ్యా ! కిట్టయ్యా !
ఏందిర ? ఓసోసి ! మొగము
పందిరిపై జుట్టుచెదిరె, పరవశమా?ఆ
ముందరి పలుసందులపై
చిందు నగవు ముత్యములను చేకొందు హరీ !
మనకవి జాషువా
తిక్కనలా వేమనలా
చక్కని గురజాడలాగ జాషువ, తెలుగుల్
అక్కున జేర్చిన మనకవి,
మ్రొక్కి తెలుగు శారదలకు మ్రోడ్తును కరముల్ .
23, జులై 2020, గురువారం
వచ్చె వచ్చె కన్నయ్య .....
వచ్చె వచ్చె కన్నయ్య ఈ వంక వచ్చె
పరుగు పరుగున ఆలు దౌడురుక వెనుక
నవ్వు మోమున త్రుళ్ళింత నగలు మెఱయ
ఆడుకొందము రావయ్య ! ఆది పురుష ! .
ఆ నవ్వుమీది మోహము
మానంగా తరమ ? మాకు , మానసచోరా !
రా , నాతండ్రీ ! పరుగున ,
రానా ? నేనైన , నాడ , రాత్రిందివముల్ .
మాటలు శివతత్వమ్ములు
మాటలు శివతత్వమ్ములు
మాటున వెలుగొందు నర్థ మా యుమ తత్వమ్
మాటాడునెడల భద్రము
పాటించుట శుభము మానవాళికి జగతిన్ .
నడయాడె శివుడు కాశీ
గడపన గల గాంగ తటము కలదిరుగుచు , నో
బడబానల నిటల నయన !
దడరా నినుజూడ , అమ్మదయగలదు హరా !
22, జులై 2020, బుధవారం
కబరీభర కందము .....
పడతుక కబరీభరమున
నడుమ పసిడి సూర్యబింబనాగరమును , పై
గుడుసున మల్లెల సరములు
ముడిచె , మదనరథపు చక్రమో యన సరసుల్
17, జులై 2020, శుక్రవారం
బంగారు మొగ్గదొడిగె .....
మొక్క ననదీసి బంగారు మొగ్గదొడిగె
ఇనుడు కిరణాలు జల్లి పుష్పింప జేసె
చినుకు ముత్యాలు చింది ఆశీర్వదించె
హరిని జేరంగ పువ్వు కర్హత లభించె .
అరుదైన కృష్ణకమలం
పది దళాలు , పైన పరమాత్మ చక్రంబు ,
ఆకుపచ్చ పటల , మందుమీద
మూడుకేసరాలు , మూడేండ్ల కొకమారు
కనులు విచ్చు , కృష్ణకమల మండ్రు .
13, జులై 2020, సోమవారం
చూడరా ! మేధావి !
చూడరా మేధావి ! గోడగట్టినయట్టు
లనృతము సెప్పుటే ఆర్జనగున ?
చూడరా నేతా ! వచో జాల మొక్కటే
బతుకుబాటా భువి బతుక , చెడుగ !
చూడరా వ్యాపారి ! వీడని మోసమే
జీవనమార్గ సంజీవి యేమి ?
చూడరా సాధు ! ఈడాబు బురిడివేష
మవసరమా యింత యశనమునకు ?
కష్టపడకుండ తేరగా కాదు తినుట ,
కష్టపడుటన్న యేమిటో కాస్తచూడు ,
బిడ్డ నొడిగట్టి యిటుకల పేర్పు మోసి
బువ్వ కొఱకు శ్రమించెడు పుణ్యవతిని .
వయసు జయించింది .....
' వయసుడిగె నస్త్ర సన్యా
స యోగమేయిక ' యనుట , నసత్య మ్మని, ఈ
ద్వయము నిరూపించి , రహో !
జయ జయ ధ్వానమ్ములిడిరి జనముహుషారై .
11, జులై 2020, శనివారం
ప్రకృతి కుంచె .....
పరమపురుషుని చేతిలో ప్రకృతికుంచె
నీటిలో అద్ది రచియించె నీ విచిత్ర ,
మేరికైనను సాధ్యమా కోరి సేయ ,
నీకు తెలియని విద్యలా నీరజాక్ష !
10, జులై 2020, శుక్రవారం
ధర్మజుడే యెందుకని ? .....
తనకన్న తెలివిడి తనమున్న వారలు
లేరను యహముచే చేర డొకడు
తనకన్న సొగసైన ఘనులు లేరను నహం
కారము కనుగ్రప్పి చేర డొకడు
మగ లైదుగురి లోన మగువ ' కింద్ర సుతుడె '
' మక్కువ ' లోపమై చిక్కె నొకతె
విలు విద్యలో తన చెలువమ్ముపై నున్న
అతిశయ మొకనికి అడ్డు నిల్చె
మరణ వేదన పడుచున్న మనుజు జూచి
పరగ నానంద పడుటచే పడియె నొకడు
తుదకు ధర్మజుం డొక్కడే ముదము తోడ
బొందితో స్వర్గమును జేరె పూజ్యు డగుచు .
9, జులై 2020, గురువారం
మొక్కనాటుము .....
ఇంటిలో నాటిన నింటిల్లపాదికీ
ప్రాణవాయువొసగి రక్షసేయు
బస్టాండులో నాట పదిమందితో నీకు
దీవన లిప్పించు పావనముగ
దేవాలయమ్ములో దీపించినాటిన
దేవుని కృపగల్గితీరు నీకు
తగ స్మశానవాటి తరువు నాటినవాడు
జన్మజన్మలకీర్తి జాతు డగును
చెట్టు నాటుము , శ్రీరస్తు, చెలిమికాడ!
పుట్టువుకు సార్థకమ్మగు, గిట్టికూడ
బతికియుందువు, చెట్టురూపాన, వంద
లేళ్ళు, భూమిపై చావు జయించి సఖుడ !
5, జులై 2020, ఆదివారం
గురుపూర్ణిమ శుభాకాంక్షలు
వందే కృష్ణ జగద్గురుమ్ సురమునివ్రాతాది సంపూజితమ్ వందేవ్యాసమునిమ్ పురాణపురుషమ్
వాగీశ్వరమ్ ఙ్ఞానదమ్ వందే సాయి పరాత్పరమ్ సకలదేవవ్రాత రూపాద్భుతమ్ వందే
సర్వగురుప్రపంచవిభవమ్ భాస్వంత మోక్షప్రదమ్ .
కృష్ణం వందే జగద్గురుమ్
శిఖిపింఛ వలయిత శీర్ష కుంతలభార
విపినప్రసూనాక్ష వీక్షితుండు
గిరిధాతు చిత్రిత తిరుతిలక మనోఙ్ఞ
వర రుచిర నిటల వర్ణితుండు
అమృత మ్మొలుక వేణు వనయమ్ము మ్రోయించు
లావణ్య రూప విలాసితుండు
బాల తమాల వినీల మంగళ తనూ
ప్రభల చెలంగు పరాత్పరుండు
నందబాలుండు , కృష్ణుండు , నగధరుండు
వాసుదేవుండు , గోగోప వర సఖుండు
గరిమ గీతోపదేశ జగద్గురుండు
మదిని సాక్షాత్కరించె నమస్కరింతు .
విపినప్రసూనాక్ష వీక్షితుండు
గిరిధాతు చిత్రిత తిరుతిలక మనోఙ్ఞ
వర రుచిర నిటల వర్ణితుండు
అమృత మ్మొలుక వేణు వనయమ్ము మ్రోయించు
లావణ్య రూప విలాసితుండు
బాల తమాల వినీల మంగళ తనూ
ప్రభల చెలంగు పరాత్పరుండు
నందబాలుండు , కృష్ణుండు , నగధరుండు
వాసుదేవుండు , గోగోప వర సఖుండు
గరిమ గీతోపదేశ జగద్గురుండు
మదిని సాక్షాత్కరించె నమస్కరింతు .
కృష్ణుణ్ణి తలుస్తేనే –
జగత్తంతా ‘ ఆడతనం ’ పరచు కొంటుంది .
‘ మథుర భక్తి ‘ మనోఙ్ఞమై విరుచు కుంటుంది .
జగన్నాధుని ఆరాధనతో ‘ మనోనేత్రం’ తెరుచు కుంటుంది .
కృష్ణుని పేరు వింటేనే –
జగత్తుకు ‘ భగవద్గీత ’ విన్పిస్తుంది .
‘ అధర్మంపై ’ ధర్మ పోరాటం మొదలౌతుంది .
ఆర్తులకు జగన్నాధుని ‘ ఆశ్రయం ’ లభిస్తుంది .
కృష్ణుని రూప లావణ్యం చూస్తేనే –
జగత్తులోని ‘ అందమంతా ’ కళ్ళకు కట్టినట్లు కనబడుతుంది .
ఆత్మకు ‘ అనిర్వచనీయమైన ’ ఆనందం కల్గుతుంది .
జన్మాంతర దు:ఖాలకు ‘ విముక్తి ’ లభిస్తుంది .
‘ మోవి ’ తాకిన ‘ క్రోవి ’ మోహనరాగ మాలపిస్తుంటే
ప్రకృతి యావత్తూ సమ్మోహిత మైన ఈ వేళ
‘ బృందావన విహారిని ’ స్మరించు కొందాం .
మహాత్ముల సంస్మరణ
మానవ జీవితాలకు
మార్గ దర్శనం చేస్తుంది .
జగన్నాధుని కని పెంచిన దేవకీ-వసుదేవులనూ , యశోదా-నందులనూ –
కృష్ణ ద్వైపాయణుణ్ణీ , కృష్ణనూ , కృష్ణ సచివుణ్ణీ –
రాధ , రుక్మిణి , మీరా , జయదేవుడు , వామదేవుడు , క్షేత్రయ్య మొదలైన భక్త శిఖా మణులనూ –
కృష్ణుణ్ణి తెలుగు వాకిటికి తెచ్చి , ప్రతిష్ఠించిన పోతన్ననూ
కన్నయ్యతో పాటు ‘ గురుపౌర్ణమి ’ రోజున
స్మరించు కుందాం .
“ కృష్ణం వందే జగద్గురుం “
4, జులై 2020, శనివారం
వైద్యో నారాయణో 'హరీ'
గురువునూ , వైద్యుణ్ణీ దైవంగా భావించే కర్మభూమి మనది . వైద్యో నారాయణో హరి : అని కదా ఆర్యోక్తి . అందువల్ల డాక్టర్లందరికీ పాదాభి వందనాలు .
ఈపోష్టు 2015 జులై 1న పబ్లిష్ చేసింది .
ఈపోష్టు 2015 జులై 1న పబ్లిష్ చేసింది .
ఏరంగంలోనైనా దగా మోసం ఉంటే , ఎత్తి చూపడమే నా దృక్పథం . మిత్రుల కోసం మళ్ళీ
ప్రచురిస్తున్నాను .
పూర్వం విద్యా- వైద్యం రెండూ సామాజిక అత్యావశ్యకాలుగా గుర్తించి సంస్థలూ , దాతలూ , ప్రభువులూ ఉదారంగా అవసరమైన వ్యవస్థల్ని ఏర్పాటు చేసి ఉచితంగా అందించేవారు . నేడు మన కర్మ కొద్దీ మనచేత ఎన్నుకొన్న మన ప్రజా ప్రభుత్వాలు మాత్రం విద్యనూ , వైద్యాన్నీ వ్యాపార వస్తువులుగా మార్చి ఖరీదయిన అవసరాలుగా చేశారు .
ఇక అసలు విషయాని కొస్తే -----
నాకు చాలా రోజులుగా ఎడమవైపున కడుపులో మంటగా ఉంటుండేది . ఒకటి రెండు సార్లు డాక్టర్లు ఎండోస్కోప్ చేయించి అల్సర్లేవీ లేవన్నారు . ఒక డాక్టరు మాత్రం ఎండోస్కోప్ లో కనిపించక పోయినా పెప్టిక్ అల్సర్ ఉంది
మీకు అని ఒక కోర్సు మందులు రాయడం , వాడడం , ఉపశమించడం జరిగింది .
మళ్ళీ ఈమధ్య కని పించే సరికి - హైదరాబాదులో ఉన్నాంకదా అని – మహానగరంలో పేరొందిన
ఏకైక పెద్ద గ్యాస్ట్రో ఎంటరాలజీ హాస్పిటల్ లో చూపించి బాధనుండి పూర్తిగా విముక్తి పొందాలని ఆశ పడ్డాను .
ఖాళీ కడుపుతో ఒకరోజు ఉదయాన్నే ఆరింటికి హాస్పిటల్ చేరుకున్నాను . అప్పటికే రిజిష్ట్రేషన్ కౌంటర్
వద్ద చాలా మంది గుమి గూడి ఉన్నారు . ఫీజు చెల్లించి నేనూ రిజిష్టర్ చేయించు కున్నాను . హాల్లో వెయిట్ చేయమన్నారు . తొమ్మిది కావస్తోంది . హాస్పిటలంతా హడావిడి మొదులైంది . సందర్శకులతో , సిబ్బందితో క్రిక్కిరిసి
సికిందరాబాదు రైల్వే ష్టేషన్ లా కనువిందు చేస్తోంది .
ఈలోగా హాల్లో ఉన్న మైక్ లోంచి చెకింగ్ బ్లాకు లోకి ఆహ్వానిస్తూ కొన్నిపేర్లు ఎనౌన్స్ చేశారు . నాపేరు కూడా ఉండడం గమనించి వెళ్ళాను . ఒక్కో చిన్న చిన్న కేబిన్ లోకి ఒక్కొక్కర్ని పంపించారు . చెకప్ డాక్టర్ రావడంతో
నేను నా గోడు వెళ్ళబోసుకోవడం మొదలెట్టాను . ఆయన విటున్నాడో లేదో నాకయితే అర్థం కాలేదు . చిట్టీ మీద
రాసుకుంటూ పోతున్నాడు . అంతా ఒక్కనిమిషంలో అయిపోయింది . ఆ చీటీ నాకిచ్చి క్యాష్ కౌంటర్ కెళ్లమన్నాడు .
కౌంటర్లో బిల్ వేసి రు.7900 – కట్టమన్నారు . నేనంత పైకం తీసుకెళ్ళ లేదు . కార్డుంది . తీసిచ్చాను .
పైకం జమ చేసుకుని , ఎండోస్కోపీ యూనిట్ కెళ్ళమన్నారు . ఎండోస్కోపీ తదుపరి , బ్లడ్ శాంపిల్ యూనిట్ ,
అల్ట్రా సౌండ్ స్కానింగ్ ఇవన్నీ అయ్యేసరికి పన్నెండు దాటింది . ఇంకా కొలనో స్కోప్ మిగిలే ఉంది . అప్పటి వరకూ
ఏమీ తిన లేదు , తాగలేదు . ఖాళీ కడుపే . ఓరి దేవుడా ఏమిటీ ఖర్మ అనుకుంటూ కొలనోస్కోప్ కోసం విచారించాను .
హాస్పిటల్ మందుల షాపు చూపించి కొలనోస్కోప్ కిట్ కొని తెమ్మన్నారు . మంచినీళ్లు లీటర్ బాటిళ్ళు
రెండు కొనమన్నారు . కిట్ లోని టాబ్లెట్ మింగించినారు . ఒక్కొ లీటర్ లో రెండు పొట్లాల పౌడర్ కలిపి అరగంటకోసారి
తాగమన్నారు . అరగంట తర్వాత మోషన్స్ మొదులౌతాయి . పది పన్నెడు సార్లు మోషన్స్ తరువాత రండి . సెకండ్ ఫ్లోర్ లో కెళ్లండి . అంతా అర్థమౌతుంది . సాయంత్రం ఐదు తర్వాత కిందికి రండి అన్నారు .
అన్నీ సిధ్ధం చేసుకుని సెకండ్ ఫ్లోర్ చేరే సరికి మిత్రులు ఆడా మగా చాలా మందే ఉన్నారు . నేనూ వారితో చేరి నరకంలో విహరించాల్సి వచ్చింది ఐదు వరకూ .
కొలనో స్కోపీ యూనిట్ లోకి వెళ్లి టెస్ట్ పూర్తి చేసుకుని బయట పడే టప్పటికి ఏడయ్యింది .
రిపోర్ట్స్ కలెక్ట్ చేసుకునే సరికి ఎనిమిదయ్యింది . అన్నీ నార్మల్ రిపోర్ట్స్ .
పది పన్నెండు మందిని ఒక్కో డాక్టర్ కేబిన్ కు తీసుకెళ్ళారు . డాక్టర్ సహాయకుడు మాఫైళ్ళు
తీసుకుని అవసరమైన సమాచారాన్ని నమోదు చేసి ఒక్కొక్కర్నీ డాక్టర్ వద్దకు పంపిస్తున్నాడు .
నేను వెళ్ళే సరికి డాక్టర్ ఫోనులో మాట్లాడు తున్నాడు . నేను వెళ్ళి నిలబడ్డా . ఉలుకూ పలుకూ లేదు .
నిలబడే ఓపికలేదు . వయసా అరవై మూడు . రోజంతా ఉపవాసం . పైగా కొలనోస్కోప్ ప్రిపరేషన్ కోసం పది పన్నెండు సార్లు .......
ఫోను సంభాషణ పూర్తయినట్లుంది . ఫైలందుకుని డాక్టర్ ఏదో రాస్తున్నట్లనిపించి , నేను నాగోడు
వెళ్ళబోసుకుంటున్నాను . వింటున్నట్లు లేదు . విన్నట్లు లేదని మళ్ళా మొదలెట్టేను . మందులు రాశాను కదా అన్నాడు , ఇక వెళ్లమన్నట్లు చూచి . బెల్ కొట్టేడు , ఇంకొకర్ని పంపమని .
తీరా ఏమి రాశాడా అని చూస్తే , పది మందుల పేర్లు టైప్ చేసిన ఒక స్లిప్ నా ఫైల్లో అంటించి ఉంది .
పేర్లకు ముందున్న బాక్స్ లలో ఈయన గారు సింపుల్ గా టిక్కులు కొట్టేడు . నాకేమనిపించిందంటే అసిస్టెంట్
మందుల స్లిప్పంటించడం , డాక్టర్ టిక్కులు కొట్టడం తప్ప వీళ్లకే అధికారాలూ లేవేమో అని .
అంటే ఈ పేరు మోసిన హాస్పిటల్లోకి అడుగిడితే మనంచెప్పేది అస్సలు వినరు . అక్కడున్న దాదాపు
అన్ని టెస్టులూ వాయించేస్తారు . మందుల చీటీలు ముందే అంటించి మందులు అమ్మేసుకుంటారన్నమాట .
ఏమిటో అంతా మాయాజాలం . మరి రోగం కుదిరిందా అంటే , కుదిరితే ఈ సోదంతా ఎందుకూ .
జాలంలో చిక్కుకుంటే గాని తత్త్వం బోధపడదు కదా !
వైద్యో నారాయణో ‘ హరీ ‘ - అని సరిపుచ్చుకుందాం .

ఇదీ _ కార్పొరేట్ హాస్పిటల్స్ దందా . దగా .
తస్మాత్ జాగ్రత్త .
2, జులై 2020, గురువారం
తాపము హరియించువాడు .....
రూప గుణ యశో విభవము
లా పరమాత్మకు వినూత్న మై వెలుగొందున్
పాపా ! గోదా ! యతడే
తాపము హరియించువాడు తరతరములకున్
పరతత్వము చేరంగా .....
పరతత్వము చేరంగా
వరతప మొనరించి భక్తవరులు పరమునిన్
సురుచిర తన్వర్థమిటుల
తరుణీమణి రాధికవలె దాల్తురు చేరన్ .
1, జులై 2020, బుధవారం
అందరున్నత కులజులే .....
హస్త సాముద్రికం బందించి భవితను
నేడె కళ్ళకు గట్టు నేర్పరొకడు
జ్యోతిష్యము మనుష్యజాతికి తగిలించి
గతుల నాపాదించు ఘను డొకండు
పేరును సంఖ్యగా పేర్చి యిట్టటు మార్చి
నెంబరు గేమాడు నేర్పరొకడు
తాయెత్తు గట్టి మంత్రాలు మాయ లొనర్చ
నేమమ్ము గల మహనీయు డొకడు
అంద రున్నత కులజులే , అందులోను
శాస్త్ర పాండితీ ధిషణులే , చదువు నింత
ఘనముగా వాడుచున్నారు కడుపు కొఱకు
వారి ఘనతకు శతకోటి ప్రణతు లిడుదు .
26, జూన్ 2020, శుక్రవారం
ఆ వొడ్డూ పొడుగూ ....
ఆ వొడ్డూ పొడుగూ, ఆ
శ్రీవత్సము , పొగడదండ , శ్రీవంశీగా
నావన మోహన శుభతను
పావనమంగళ మనోఙ్ఞ భవ్యవిలాసాల్
ఎందే గంటిమ కష్ణా ?
అందమునకు అతివలండ్రు , అది నిజమా , కా
దందమునకు నీ రూపమె ,
డెందము పరవశమగు , మరుడే సరి రాడే !
రాధారాధితవంశీ
శోధన విధి గాంచు కృష్ణ ! శోభన మూర్తీ !
మాధవ ! రమాధవా! మధు
సూధన ! పరమాత్మ ! శ్రీయశోదానందా !
ఆ నలుగురు .....
భజన సేయ పావనికన్న భక్తు డేడి ,
రక్షసేయ రామునికన్న రాజు లేడు ,
తలప సీతకన్న కొలువ తల్లి లేదు ,
అన్నసేవ లక్ష్మణుకన్న ననుజు డేడి .
దీనికి సబ్స్క్రయిబ్ చేయి:
పోస్ట్లు (Atom)